Home / SLIDER / ముల్కనూర్ లైబ్రరీ దేశానికే మోడల్ లైబ్రరీ కావాలి

ముల్కనూర్ లైబ్రరీ దేశానికే మోడల్ లైబ్రరీ కావాలి

ముల్కనూరు గ్రామం సహకార ఉద్యమానికి పెట్టింది పేరని…ఈ స్పూర్తితో ఈ లైబ్రరీ కూడా దేశానికి మోడల్ లైబ్రరీగా అభివృద్ధి చేయాలని ఉపముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. ముల్కనూర్ ప్రజా గ్రంథాలయాన్ని పూర్తి చేసేందుకు తన ఎమ్మెల్సీ నిధుల నుంచి 15 లక్షల రూపాయలను ఇస్తున్నట్లు ప్రకటించారు. నేడు ముల్కనూర్ లో నిర్మించిన ఫిష్ మార్కెట్, షాపింగ్ కాంప్లెక్సు, ప్రజా గ్రంథాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ప్రభుత్వ చీఫ్ విప్ పాతూరి సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, స్థానిక ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్, కలెక్టర్ ఆమ్రపాలి, వరంగల్ జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిఐజీ శ్రీనివాస రావు, ముల్కనూర్ సహాకార బ్యాంక్ చైర్మన్ ప్రవీణ్ రెడ్డి , కావేరి సీడ్స్ అధినేత భాస్కర్ రావు, గ్రామ సర్పంచ్ వంగ రవి తదితరులు పాల్గొన్నారు.

ముల్కనూరు ప్రజా గ్రంథాలయం దేశానికి మోడల్ లైబ్రరీగా కావడానికి వ్యక్తులతో నిమిత్తం లేకుండా నిరంతరం పనిచేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ….ఇటీవల టెక్నాలజీ పెరగడంతో పుస్తక పఠనం తగ్గిందని, తద్వారా లైబ్రరీలకు ఆదరణ లేకుండా పోయిందన్నారు. ఈ తరం పిల్లలు పుస్తకపఠనం చేయడం లేదని..కేవలం పాఠ్యపుస్తకాలు తప్ప వేరే పుస్తకాలు చదవడం లేదని చెప్పారు. . నిజంగా అంత సమయంగానీ, అంత ఓపికగానీ ఈతరం విద్యార్థులకు లేదన్నారు. అంతే కాకుండా టెక్నాలజీ పెరగడంతో ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్లకు వెళ్తున్నారని చెప్పారు.

శాస్త్ర, సాంకేతిక పరంగా ఎంత అభివృద్ధి చెందినా పుస్తకం చదివితే దొరికే సంతృప్తి ఇంటర్నెట్ ద్వారా లభించదని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. అయితే అన్ని పుస్తకాలు కాకుండా సమాజ హితానికి, భారత దేశ స్వాతంత్రోద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో వచ్చిన సాహిత్యం, పుస్తకాలు గొప్ప వ్యక్తులు రాసిన పుస్తకాలు ఎంపిక చేసుకుని చదవాలని, వాటిని ఆస్వాదించాలని సూచించారు. ఇందుకోసం లైబ్రరీలను ఉపయోగించుకోవాలన్నారు. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ భావజాల వ్యాప్తి రెండు రకాలుగా జరిగిందని అందులో ఒకటి సాహిత్యం , మరొకటి పుస్తక పఠనమని తెలిపారు. ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారని చెప్పారు. తెలంగాణ గత పాలనలో అనేక విధాలుగా నష్టపోయిందని, అందులో విద్యాపరంగా, సాహిత్యంపరంగా, సాంస్కృతిక పరంగా వెనుకబడి అనుకున్న స్థాయిలో పురోగతి సాధించలేదన్నారు. అందుకే తెలంగాణ వచ్చాక పేద, బడుగు, బలహీన వర్గాలకు నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో సిఎం కేసిఆర్ ఎక్కువ గురుకులాలను ఏర్పాటు చేశారని చెప్పారు. గతంలో విద్యావ్యవస్థ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం, గత ప్రభుత్వాలు విద్యను నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రభుత్వ విద్య గాడి తప్పిందన్నారు. ప్రజలకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం పోయిందని, తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు తిరిగి నమ్మకం వచ్చే విధంగా వాటిని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ పాఠశఆలలు, కాలేజీలకు నిధులు ఇస్తున్నామని, నియామకాలు చేస్తున్నామని, అయితే కోర్టు కేసుల వల్ల నియామకాలు కొంత జాప్యం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

గత రెండేళ్లుగా విద్యార్థులు ప్రైవేట్ విద్యాలయాల నుంచి ప్రభుత్వ విద్యాలయాలకు వస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం తెలంగాణలో 570 గురుకులాలు ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ఇవన్నీ రెసిడెన్షియల్ విధానంలో, ఇంగ్లీష్ మీడియంలో మంచి మెనుతో, మంచి వసతులతో నాణ్యమైన విద్య అందిస్తున్నాయన్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులు వచ్చే 5 ఏళ్ల తర్వాత జేఈఈ, నీట్, ఐఐటి పోటీ పరీక్షల్లో అత్యధిక సంఖ్యలో సీట్లు సాధిస్తారన్న నమ్మకం తనకుందన్నారు. ఒక్కో విద్యార్థిపై గురుకులాల్లో లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేస్తున్నామని, అంత మంచి విద్యను గురుకులాల్లో అందిస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడా కూడా తెలంగాణలో ఉన్నన్ని గురుకులాలు లేవన్నారు. అంతే కాకుండా అన్ని గురుకుల పాఠశాలలను ఈ ఏడాది నుంచి జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేస్తున్నామన్నారు. ఈ నాణ్యమైన విద్య ద్వారా తెలంగాణ పున: నిర్మాణంలో విద్యార్థులంతా భాగస్వామ్యం కావాలన్నది ముఖ్యమంత్రి కేసిఆర్ లక్ష్యమన్నారు. గడిచిన మూడు, నాలుగు సంవత్సరాలుగా విద్యారంగంలో చేసిన ప్రయత్నం ఇప్పుడిప్పుడే ఫలితాలు ఇస్తోందని చెప్పారు. ఇటీవలే ముఖ్యమంత్రి కేసిఆర్ స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో 3125 కోట్ల రూపాయల ఖర్చుతో 10.78 టిఎంసీల సామర్థ్యమున్న లింగంపల్లి రిజర్వాయర్ కు అనుమతినిచ్చారని తెలిపారు. దీనివల్ల భీమదేవరపల్లి మండలం, ఎల్కతుర్తి మండలంలో ధర్మసాగర్ రిజర్వాయర్ ద్వారా ఈ ప్రాంతాలకు సాగునీరు అందించే అవకాశం లభిస్తుందని చెప్పారు.

వరద కాల్వ నిర్మాణం కోసం స్థానిక ఎమ్మెల్యే సతీష్ కుమార్ తీవ్ర కృషి చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కొనియాడారు. ఈ కాల్వవల్ల కరువుకు గురవుతున్న హుస్నాబాద్ నియోజక వర్గంలో రెండు పంటలకు సాగునీరు అందనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat