రెబల్‌స్టార్ కృష్ణం రాజు, రాజకీయాల్లో కూడా అదే పేరును నిలబెట్టుకున్నారు. మరి కృష్ణంరాజుకు బీజేపీ అధిష్టానం గవర్నర్ పదవి ఇస్తున్నారా..? లేక ఇచ్చేశారా..? అసలు ఇంతకీ కేంద్ర ప్రభుత్వంలో ఏం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కృష్ణంరాజు రియాక్షన్ ఎలా ఉంటుంది..? కృష్ణంరాజు ఎలాంటి వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకున్నారు.
కృష్ణం రాజు బీజేపీకి అనుకూలంగా తన వాదనను వినిపిస్తూ.. ఎలాగో కేంద్రంలో ఉన్నది బీజేపీనే కదా..! కనీసం గవర్నర్ పదవి అయినా ఇవ్వకపోతారా..? అని తెగ ఆరాటపడిపోతున్నారు. ఈ క్రమంలో ఎక్కడ అవకాశం దొరికినా ప్రఢీని మోడీని పొగిడేస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల కాలంలో ఏపీలోని పలువురు బీజేపీ నాయకులను సైతం కలిశారు కృష్ణం రాజు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీడీపీ నేతలు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శల వర్షం కురిపించారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం వల్ల దేశంలో ఎంత మంది మోడీపై విశ్వాసం చూపుతున్నారో మరో సారి రుజువైందన్నారు. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసానికి 18 పార్టీల మద్దతు కూడగట్టామని చెప్పారు కానీ, ఒక్క పార్టీ కూడా టీడీపీకి మద్దతు తెలపలేదన్నారు.