ఏపీ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి,కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు మద్ధతు తెలిపారు.ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్ది మాట్లాడుతూ కాపులకు రిజర్వేషన్లు ఇచ్చే పరిథి నాచేతిలో లేదు..కేంద్రం చేతిలో ఉంది. అయితే ఒకపక్క కాపులు కొరితే కేంద్రం మీద పోరాడ్తా..కానీ రిజర్వేషన్లు ఇస్తాను అని ఖచ్చితంగా చెప్పలేను.
అలా చెప్పి మిమ్మలని మోసం చేయలేను.. అయితే మీకోసం నిధులు ఎక్కువ మోతాదులో కేటాయిస్తా అని తెలిపారు.దీనిపై మాజీ మంత్రి ముద్రగడ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కాపుజాతికి రిజర్యేషన్లు కల్పించేస్తారేమోనని జగన్ మోకాలడ్డుతున్నారని ..బాబుపై తనకు నమ్మకముందని.. తమ రాజకీయ వ్యూహాలు తమకున్నాయని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రికి మా జాతి తరుపున విన్నపం.., కాపు రిజర్వేషన్లను కేంద్రం పరిధిలో తరవాత అమలు చేద్దురుగాని… రాష్ట్ర పరిధిలో తక్షణం అమలు చేయండి. ఆ అధికారం ముఖ్యమంత్రికి ఉంది. వంకలు పెట్టకుండా మా జాతి ఆకలి తీర్చండి’ అంటూ ముద్రగడ పద్మనాభం విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతానికి అధికారంలో ఉన్న చంద్రబాబే తమ రిజర్యేషన్లు అమలు చేస్తారని ఆశిస్తున్నామని ముద్రగడ ఆయన అన్నారు. అయితే ఇన్నాళ్ళు బాబును తిట్టిన ఆయన ఒక్కసారిగా బాబుపై నమ్మకముందని ప్రేమలు కురిపించడం వెనక మతలబు ఏందో వారికే ఆర్ధమవ్వాలి..