ఇటీవల ఏపీ బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన మాజీ మంత్రి కన్నాలక్ష్మీ నారాయణ శనివారం రాష్ట్రంలోని కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైసీపీ పార్టీకి మాజీ ఇంచార్జ్ కోట్ల హారి చక్రపాణి రెడ్డితో భేటీ అయ్యారు ..కోడుమూరు మండలంలో లద్దగిరిలోని హారి స్వగృహాంలో దాదాపు గంట పాటు ఈ భేటీ జరిగింది.
అయితే గతంలో కన్నా లక్ష్మీ నారాయణ వైసీపీలోకి వస్తారు .అందుకు తగిన ఏర్పాట్లు కూడా జరిగిపోవడం.ఆ తర్వాత అనారోగ్యానికి గురికావడంతో అది వాయిదా పడింది.ఆ తర్వాత అయన బీజేపీలో చేరడం.. పార్టీ అధ్యక్షుడిగా అవ్వడం మనకు తెల్సిందే.. తాజాగా ఆయన మాజీ వైసీపీ నేతతో భేటీ అవ్వడం పలు అనుమానాలకు తావు తీస్తుంది..