హరితహారంలో భాగంగా మొదలైన గ్రీన్ చాలెంజ్ ఉద్యమంలా కొనసాగుతున్నది. హరా హైతో బరా(పచ్చదనంతోనే నిండుదనం) అంటూ ప్రముఖులు మొక్కలు నాటుతూ గ్రీన్ చాలెంజ్‌లో పాల్గొంటున్నారు..ఈ క్రమంలోనే రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్, క్రికెటర్లు వీవీఎస్ లక్ష్మణ్, సచిన్, ప్రముఖ నటుడు మహేశ్‌బాబు, హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ హడ్డాలకు గ్రీన్ చాలెంజ్ చేశారు.మంత్రి సవాలును స్వీకరించిన క్యాథరిన్ హడ్డా శుక్రవారం మొక్కలు నాటగా..శనివారం క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీవీఎస్ లక్ష్మణ్‌లు మూడు మొక్కలు నాటారు.ఈ సందర్బంగా సచిన్ ట్వీట్ చేస్తూ..హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ గ్రీన్ ఛాలెంజ్‌కు నన్ను నామినేట్ చేసినందుకు ధన్యవాదాలు అని కేటీఆర్ నేను స్వికరిస్తున్నా..అని ట్వీట్ చేశారు.అనంతరం లక్ష్మణ్ ట్వీట్ చేస్తూ.. పచ్చదనం అనే ప్రేమ విత్తనం ఎప్పటికి మరణించదు. మంచి నిర్ణయం కేటీఆర్. నేను దానిమ్మ, వాటర్ యాపిల్, లక్ష్మణ ఫలం మొక్కలు నాటాను అని పోస్ట్ చేశారు.ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ వీరికి ధన్యవాదాలు తెలిపారు.
The love of gardening is a seed once sown that never dies. Great initiative @KTRTRS ,I have planted pomegranate, water apple & Laxman Phal saplings . I nominate @virendersehwag , @M_Raj03 & @Pvsindhu1 to plant 3 trees, nurture them and make #HarithaHaram a sustainable movement pic.twitter.com/6mSRNqPBwk
— VVS Laxman (@VVSLaxman281) July 28, 2018
Thank you, @KTRTRS, for nominating me for the green challenge #HarithaHaram. I accept the challenge and hope all of you do too. The key to a greener planet is in our hands. pic.twitter.com/vMzifaGjlm
— Sachin Tendulkar (@sachin_rt) July 28, 2018