ఉన్నత చదువులు..ప్రపంచమే సలాం కొట్టే స్థాయి..లగ్జరీ జీవితం.అయితేనేమి అవన్నీ తన జీవితంలో ఒక భాగం మాత్రమే నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల కోరిక స్వరాష్ట్ర సాధన కోసం బయలుదేరిన ఉద్యమ రథసారధి,ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బాటలో మలిదశ ఉద్యమంలో పాల్గొని స్వరాష్ట్ర సాధనే ముఖ్యమైనదని భావించి అలుపు ఎరగని పోరాటం చేసిన ఉద్యమకారుడు..
దాదాపు స్వరాష్ట్రం సిద్ధించేవరకు ఉద్యమరథసారధి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రుద్రమ్మ నిజామాబాద్ ఎంపీ కవిత,ప్రస్తుత మంత్రి,నాటి ఉద్యమ యువనాయకుడు కేటీఆర్ గారి మర్గదర్శకంలో అలుపు ఎరగని పోరాటాలు..ఉద్యమాలు.. విదేశాల్లో తెలంగాణ ఆకాంక్షను చాటి చెప్పిన తెలంగాణ ముద్దు బిడ్డ న్యూజీలాండ్ దేశ టీఆర్ఎస్ అధ్యక్షుడు విజయ భాస్కర్ రెడ్డి కొసన.నాడు స్వరాష్ట్ర సాధనకోసం అలుపు ఎరగని పోరాటం చేసి నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బంగారు తెలంగాణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు విజయ్ ..
విదేశాల్లో ఉన్న తెలంగాణ బిడ్డలకు కానీ ఇక్కడ స్వరాష్ట్రంలో కానీ ఎవరికీ ఏమి కష్టమోచ్చిన కానీ నేనున్నాను అందరికీ అందుబాటులో ఉంటూ అన్నివేళల అండగా ఉంటున్నారు..ఈ క్రమంలో రేపు అయన జన్మదినం సందర్భంగా న్యూజీలాండ్ టీఆర్ఎస్ శాఖ ,పార్టీ శ్రేణులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ బంగారు తెలంగాణ కోసం పనిచేస్తూ .మరిన్నీ పదవులను ఆయన సాధించాలని కోరుకుంటున్నట్లు టీఆర్ఎస్ న్యూజీలాండ్ శాఖ సభ్యత్వ ఇంచార్జ్ కిరణ్ పొకాల మీడియాకు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు..