ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 222వ రోజు శనివారం ఉదయం ప్రారంభమైంది. పెద్దాపురం మండలంలోని కట్టమురు క్రాస్ నుంచి పాదయాత్ర కొనసాగించారు. జగన్ తో కలిసి నడిచేందుకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. వారితో కలిసి జగన్ ముందుకు సాగుతున్నారు. అడుగడుగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పాదయాత్రలో భాగంగా దారి పొడవునా వైఎస్ జగన్‌కు స్థానికులు సమస్యలు విన్నవించుకుంటున్నారు. జగ్గంపేట మండలంలోని కాట్రావుల పల్లి క్రాస్, సీతా నగరం శివారు మీదుగా జగ్గంపేట వరకు ఈరోజు పాదయాత్ర కొనసాగుతుంది. సాయంత్రం జగ్గంపేటలో నిర్వహించే బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొంటారు.
