మీడియా … అంటే ఇటు ప్రజలు అటు ప్రభుత్వాల మధ్య వారధిగా పనిచేస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వాలకు విన్నవించడం..ప్రభుత్వాలు దిగిరాకపోతే ప్రజలు చేస్తున్న ఉద్యమాలకు బాసటగా నిలవడం..సమాజంలో జరుగుతున్న చెడును ఉన్నది ఉన్నట్లు కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ దాన్ని రూపుమాపడానికి పనిచేసే ఒక వ్యవస్థ ..కానీ అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దరిద్రమో..ఇంకా ఏమో కానీ ఇక్కడ ఉన్న ఛానెల్స్ లో తొంబై తొమ్మిది శాతం ఛానెల్స్ ప్రజల పాలిట శాపంగా మారింది. మరి ముఖ్యంగా బాబు ఆస్థాన మీడియాగా ముద్రపడిన కొన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానెల్స్.. మరి ముఖ్యంగా ఆరవై ఏండ్లు కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ గత నాలుగేళ్ళుగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఇటు అభివృద్ధి అటు సంక్షేమంలో దూసుకుపోతూ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా నిలుస్తూ వస్తుంది.
ఉద్యమ సమయంలో కొంతమంది తెలంగాణ ప్రాంత రాజకీయ నేతలతో కల్సి వలస పాలకులు రాష్ట్రం విడిపోతే చీకటి మయం అవుతుంది.. జల సమస్యలు వస్తాయి.. హైదరాబాద్లోని పరిశ్రమలు ,కంపెనీలు తరలిపోతాయి..ఉద్యోగాలు ఉండవు.. నిరుద్యోగ సమస్య పెరుగుతుంది.మరల నక్సలిజం పెరుగుతుంది అని ఇలా తెగ విషప్రచారం చేశారు.నాడు ఉద్యమ తీవ్రతను కంటే వలసపాలకులు చేస్తున్న ఇలాంటి విషప్రచారాన్ని ఎక్కువగా ప్రచారం చేశాయి మీడియా. అయితే ఎన్ని కుట్రలు చేసిన ఎంతమంది అడ్దుపడిన కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ఎవరు అడ్డుకోలేకపొయారు. అయితే ఇది అప్పటి వ్యవహారం.. తాజాగా రాష్ట్రం ఏర్పడి నాలుగేళ్ళలో ఆసరా పెన్షన్ దగ్గర నుండి కళ్యాణ లక్ష్మీ వరకు ..టీ హాబ్ నుండి టీఎస్ఐ పాస్ వరకు. మిషన్ కాకతీయ నుండి ప్రాజెక్టుల నిర్మాణం వరకు .. హరితహారం దగ్గర నుండి మిషన్ భగీరథ వరకు ..కేసీఆర్ కిట్ల దగ్గర నుండి షీ టీమ్స్ వరకు..రైతు రుణమాఫీ నుండి రైతు బీమా వరకు ..సిరిసిల్ల నుండి సిలికాన్ వరకు. సన్నబియ్యంతో భోజనం నుండి రూ ఐదుకే భోజనం వరకు..చేనేత కార్మికుల దగ్గర నుండి గీత కార్నికుల వరకు .వృద్ధుల దగ్గర నుండి రైతన్నల వరకు.పుట్టబోయే శిశువు దగ్గర నుండి ఉద్యోగం కోసం ఆరాటపడే యువకుడు వరకు.. ఇలా అనేక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ సీఎం కేసీఆర్ తెలంగాణను యావత్తు దేశమే ఆదర్శంగా తీసుకునేలా పాలిస్తున్నారు..
ఈ క్రమంలో రాష్ట్ర ప్రజలు (ఎనబై శాతం మంది సంతృప్తిగా ఉన్నారు..వందకు వంద శాతం మందిని సంతృప్తి పరచడం ఎవరి వలన కాదు..దానికి సమయం పడుతుంది.)ఆనందంగా ఉంటున్న తరుణంలో “ఏకంగా నూట ఇరవై ఐదు కోట్ల భారతీయులకు ప్రతినిధి,ప్రధాన మంత్రి సాక్షత్తు పార్లమెంటులో కేసీఆర్ పాలనపై ప్రశంసలు కురిపించిన మరుసటి రోజు నుండే బాబు ఆస్థాన మీడియా ముద్రపడిన ఈనాడు,ఏబీఎన్,ఇతర ఎలక్ట్రానికి మీడియా ఛానెల్స్ తెలంగాణపై విషప్రచారం చేయడం మొదలెట్టాయి..తెలంగాణలో చేపలు బాగోలేదు.తింటే తంటా అని ఒక రోజు ..దేవలయాల్లో ఉన్న కోనల్లో మునిగితే జబ్బులే అని రెండో రోజు ఇలా టైటిల్స్ పెట్టి మరి కథనాలను ప్రచారం చేస్తున్నాయి. అయితే దేవలయాలకు వెళ్ళడం..చేపలు తినడం ఇప్పుడే ఉన్నాయా ..గతంలో లేవా .మరి ఇప్పుడు ఉన్నట్లు ఉండి ఇవి ఎందుకు గుర్తు వచ్చాయి..అంటే గతంలో ఎన్నడు లేనివిధంగా తెలంగాణలో మత్స్య సంపద పెరిగింది.. ప్రభుత్వం చేపట్టిన చేపపిల్లల పంపిణీ ఎంతో విజయవంతమైందని మత్స్యకారులే స్వయంగా చెబుతున్నారు. ఇక దేవలయాల గురించి అయితే ఏకంగా ఒక ప్రముఖ జాతీయ పార్టీ తమను గెలిపిస్తే రామమందిరం కట్టీస్తామని వాగ్ధానాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్న తరుణంలో తెలంగాణ ఏర్పడి నాలుగేళ్ళే అయిన కానీ యాదాద్రి ఆలయాన్ని సర్వంగ సుందరంగా నిర్మిస్తూ అతిత్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చేలా పనులు కోనసాగుతున్నాయి.
ఈ క్రమంలో ఇలా తెలంగాణ ఏర్పడి నాలుగేళ్ళే అయిన కానీ దేశంలోనే అత్యంత సీనియర్ నేతను అని చెప్పుకుంటున్న మా బాబుకు రావాల్సిన పేరు ప్రఖ్యాతులు,పట్టుమని పదేళ్ళు కూడా ముఖ్యమంత్రిగా అనుభవం లేని కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ దేశమే ఈర్శ్యపడేలా పాలిస్తూ తన ఖాతాలో వేసుకోవడం బాబు ఆస్థాన మీడియాకి ఇష్టం లేదు..ఇలా వరస కథనాలతో తెలంగాణలో అనుభవం లేని ముఖ్యమంత్రి వలన వ్యవస్థ ఇలా ఉందని నమ్మించి..కేసీఆర్ కు ఉన్న పేరు ప్రఖ్యాతులు..తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అడ్దుకోవాలనే తెలుగు మీడియా అదే తెగులు మీడియా ప్రత్యేక కథనాలను ప్రచారం చేస్తుంది. అయితే బాబు ఆస్థాన మీడియా చెప్పింది..రాసింది నమ్మడానికి ఇది 1994-95కాదు..ఇది 2018..అందులో సీఎం కేసీఆర్ నాయకత్వంలో చైతన్యవంతమవుతున్న తెలంగాణ సమాజం..
ఇకనైన తెగులు మీడియా తెలంగాణపై విషప్రచారాన్ని ఆపకపోతే నెట్లో నెటిజన్లు..బయట తెలంగాణ ప్రజలు తన్ని తరిమికొట్టే రోజులు వస్తాయి..ఎందుకంటే తెలంగాణతో పెట్టుకున్నోడు..తెలంగాణపై పడి ఏడిచినోడు బాగుపడ్డట్లు చరిత్రలోనే లేదు..