రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌తో సినీనటుడు ప్రకాశ్ రాజ్ సమావేశం అయ్యారు. తన దత్తత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలు సహా ఇతర అంశాల గురించి చర్చించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో చేపడుతున్న కార్యక్రమాలు తనకు ఎంతో ఉత్సాహాన్ని కలిగించాయన్నారు. ఈ మేరకు ఆయనో ట్వీట్ చేయగా మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘ప్రకాశ్‌రాజుగారు మీతో సమావేశం అవడం సంతోషకంరం. మనం కలిసికట్టుగా పనిచేసి మీరు దత్తత తీసుకున్న కొండారెడ్డిపల్లిని ఆదర్శగ్రామంగా తీర్చిదిద్దుతాం’ అని పేర్కొన్నారు.
Good meeting you to @prakashraaj Garu. Let’s work together on making your adopted village Kondareddy Palli a model village https://t.co/Awp2BmaCG4
— KTR (@KTRTRS) July 28, 2018
కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకున్న ప్రకాశ్ రాజ్ ఈ మేరకు ఇప్పటికే పలు కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. దీనికి కొనసాగింపుగా మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అవసరం ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కలిశారు. తమ ప్రతిపాదనలు పేర్కొంటూ ఆయన వివరించగా…మంత్రి కేటీఆర్ వాటిని పరిశీలిస్తామన్నారు.