Home / POLITICS / టీ న్యూస్,ఎన్టీవి అధినేతలకు హోం మంత్రి నాయిని ఛాలెంజ్

టీ న్యూస్,ఎన్టీవి అధినేతలకు హోం మంత్రి నాయిని ఛాలెంజ్

తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని నరసింహ రెడ్డి టీ న్యూస్ ఎండీ సంతోష్ కుమార్ కు మరియు ఎన్టీవి అధినేత ఎన్ నరేంద్ర చౌదరికి గ్రీన్ ఛాలెంజ్ సవాల్ విసిరారు.ఇవాళ మంత్రి నాయిని రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని మంత్రుల నివాసంలోని తన నివాసం వద్ద  హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.

ఈ సందర్బంగా అయన ముగ్గురు అధికారులకు మరియు ముగ్గురు మీడియా యజమానులకు గ్రీన్ ఛాలెంజ్ చేశారు. రాష్ట్ర డి.జి.పి  మహేందర్ రెడ్డి , జైళ్ళ శాఖ డి.జి. వి.కె.సింగ్ , కార్మిక శాఖ కమీషనర్ అహ్మద్ నదీం లతో పాటు మీడియా యజమానులైన జె.సంతోష్ కుమార్ (టి న్యూస్ ఎం.డి. మరియు రాజ్యసభ సభ్యులు), ఎన్ .నరేంద్ర చౌదరి (ఎన్.టి.వి), వెంకటేశ్వర రావు (సి.వి.ఆర్.న్యూస్) లకు హోం మంత్రి మొక్కలు నాటాలని సూచించారు. తద్వారా వారి అభిమానులు ఎందరో హరితహారం కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో చేపడతారన్న ఆశాభావం వ్యక్తం చేసారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహార కార్యక్రమాన్ని ప్రతీ సంవత్సరం ప్రతిష్టాత్మకంగా చేపడుతుందని ఈ ప్రక్రియలో బాగంగా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటుతునట్లు తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat