తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందరికీ చేరాలన్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ కల నెరవేరుతోంది. అంగవైకల్యం అభివృద్ధికి అవరోధం కావద్దు అని దివ్యాంగుల అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వారి సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. డిగ్రీ చదువుతున్న దివ్యాంగుల కోసం వారికి మరింత ప్రోత్సాహాన్ని అందించడానికి వారికి అవసరమైన ల్యాప్ టాపులు, స్మార్ట్ ఫోన్లు, ప్రత్యేక స్కూటర్లు ఈరోజు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో వికలాంగుల కార్పొరేషన్ తరుపున లబ్ధిదారులకు మంత్రుల చేతుల మీదుగా అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, వికలాంగుల కార్పొరేషన్ ఛైర్మన్ వాసుదేవ రెడ్డి పాల్గొన్నారు.
