ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల మధ్య జరుగుతున్న వార్.. ఇటీవల వైసీపీ ఆద్వర్యంలో నిర్వహించిన ఏపీ బంద్ విజయవంతమైన సందర్భంగా వైసీపీ అధినేత జగన్మోహాన్ రెడ్డి మాట్లాడుతూ అఖరికీ కార్లను మార్చినట్లు పెళ్ళాలను మార్చేవారి గురించి మాట్లాడాల్సి రావడం మన ఖర్మా అని వ్యాఖ్యనించిన సంగతి తెల్సిందే.
అయితే పవన్ గురించి జగన్ చేసిన వ్యాఖ్యలపై పెనుదుమారమే రేగింది..తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది. అదే ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడు పవన్ కళ్యాణ్ కు వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.ఈ కథనాల ప్రకారం చిరంజీవి తన సోదరుడితో నువ్వు రాజకీయాల్లోకి వెళ్తున్నావు.. విమర్శలు చేసే ముందు పక్కా ఆధారాలతో చేయాలి..వ్యక్తిగత విమర్శలు చేయద్దు..
ప్రజలకు అన్యాయం చేసేది ప్రభుత్వమే కాబట్టి ప్రతిపక్షంతో కల్సి అధికార పక్షం మీద పోరాడాలి .అంతే కానీ ప్రతిపక్షం మీద విమర్శలు చేయకూడదు.అని హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే గత నాలుగెండ్లుగా అధికార టీడీపీ పక్షంతో కల్సి ఉన్న పవన్ కళ్యాణ్ ఇటీవల ఆ బంధానికి గుడ్ బై చెప్పి బయటకు వచ్చారు. బయటకు వచ్చినాక అధికార టీడీపీ పార్టీ అవినీతి అక్రమాలపై పోరాడకుండా ప్రతిపక్షమైన వైసీపీ మీద విమర్శలు చేస్తున్న సంగతి మనం చూస్తునే ఉన్నాం.