వైఎస్ జగన్ కొత్త ఫార్ములా ఏంటి..? ఎన్నికల్లో ఈ ఫార్ములాను ఉపయోగిస్తారా..? ఎన్నికల్లో గెలవడానికే వైఎస్ జగన్ ఈ కొత్త ఫార్ములాను ఉపయోగిస్తారా..? ఈ ఫార్ములా సక్సెస్ అవుతుందా..? ఫెయిల్ అవుతుందా..?
ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణగదొక్కేందుకే చంద్రబాబు కొన్ని టీమ్‌లను రంగంలోకి దింపారని ఆ మధ్య కొన్ని ఊహాగానాలు గుప్పుమన్నాయి. అది నిజమో కాదో తెలీదు కానీ..ఆ విషయంపై తీవ్రమైన చర్చ జరిగిన విషయం తెలిసిందే. ఇంకా ఆ విషయంపై చర్చ జరుగుతూనే ఉంది. అలా చంద్రబాబు పన్నుతున్న కుట్రలను ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు వైఎస్ జగన్. అందులో భాగంగానే అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్‌లను వైఎస్ జగన్‌పై ఆరోపణలు ఎక్కుపెడుతున్నారన్న వాదనను వారు ఖండించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇలా ఇంటా.. బయటా.. ప్రతికూల పరిస్థితులను ఎంతో ఓపిగ్గా.. అనుకూలంగా మలుచుకుంటూ వచ్చారు వైఎస్ జగన్. ఈ క్రమంలో వైఎస్ జగన్ ఎక్కడా ఆవేశపడలేదు. వెకిలి విమర్శలు, దిగజారుడు వ్యాఖ్యలు చేయలేదు. భావోద్వేగాలకు లోను కాలేదు. ఆవేశపూరితంగానూ వ్యవహరించలేదు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లో ఇసుమంతైనా ఈ లక్షణం కనిపించదు. పవన్ కళ్యాణ్ ఆవేశపడతాడు కానీ.. ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆచరణాత్మకంగా ఉండవు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల వ్యవహార శైలిని దృష్టిలో ఉంచుకున్న వైఎస్ జగన్ ప్రజలకు తానేమి చేయగలనో…? వారి సమస్యలేమిటో…? వాటికి పరిష్కార మార్గాలేమిటో..? వంటివి తెలుసుకుంటూ నిత్యం ప్రజల్లో ఉంటున్న వైఎస్ జగన్. నిజంగా వైఎస్ జగన్ ఓర్పు, ఓపిక, మంచితనంపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పుడున్న రాజకీయ నేపథ్యంలో వైఎస్ జగన్ వేస్తున్న ఈ ఫార్ములా సక్సెస్ అవుతుందని మీరు అనుకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.