Home / ANDHRAPRADESH / నగరిలో వైఎస్సార్ క్రికెట్ టోర్నమెంట్‌…ప్రతి జిల్లాలో స్టేడియాలు ఉండేలా చూస్తా..!

నగరిలో వైఎస్సార్ క్రికెట్ టోర్నమెంట్‌…ప్రతి జిల్లాలో స్టేడియాలు ఉండేలా చూస్తా..!

చిత్తూరు జిల్లా నగరిలో వైసీపీఎమ్మెల్యే ఆర్కే రోజా ఆధ్వర్యంలోఘనంగా వైఎస్సార్ క్రికెట్ టోర్నమెంటు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి వైసీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి పార్థసారథితో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. నగరిలో వైఎస్సార్ క్రికెట్ టోర్నమెంట్‌ను భగ్నం చేసేందుకు చంద్రబాబు సర్కారు కుట్ర పన్నిందని ఆరోపించారు.క్రికెట్ టోర్నమెంటుకు ప్రభుత్వ డ్రిల్ మాస్టర్లను పంపాలని తాను ఈ నెల 21న జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చానని..ఇందుకు వారు పంపుతానని కూడా తెలిపారని అన్నారు. రాత్రికి రాత్రి ఏం జరిగిందో తెలియదు కానీ ఇప్పుడు డ్రిల్ మాస్టర్లను రానీయకుండా అడ్డుకున్నారని వెల్లడించారు. ఇది తన మీద కక్ష సాధింపేనని పేర్కొన్నారు.ప్రభుత్వాన్ని, జిల్లా కలెక్టర్‌ను కోర్టుకు లాగుతానని, పరువునష్టం దావా వేస్తానని చెప్పారు.రాష్ట్రంలో ఎక్కడా క్రీడాకారులకు తగిన సదుపాయాలు లేవని, వైఎస్‌ జగన్ సీఎం అయిన తర్వాత ప్రతి జిల్లాలో స్టేడియాలు ఉండేలా చూస్తారని హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా మీద చంద్రబాబు దొంగనాటకాలు ఆడుతున్నారని, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు వైఎస్సార్సీపీ బంద్‌ను అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat