Home / ANDHRAPRADESH / పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై ..జగన్ తో ఫొటో దిగిన నటి ..తీవ్రమైన ఘాటు వాఖ్యలు

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పై ..జగన్ తో ఫొటో దిగిన నటి ..తీవ్రమైన ఘాటు వాఖ్యలు

ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ తో కొన్ని నెలల క్రితం ఓ ఆడియో సీడీ ఆవిష్కరణ సందర్భంగా దిగిన ఫొటోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ పై నటి అలేఖ్యా ఏంజల్ మండిపడింది. ఈ మేరకు తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టును పెడుతూ, తనలోని ఆవేదనను వ్యక్తం చేసింది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చేసిన పని చాలా ఘోరమైన పాపమని, ఇదే పనిని మీ అక్క లేదా చెల్లెలు ఇమేజ్ పెట్టి, ఇలాంటి ప్రచారమే చేస్తే ఎంత బాధగా ఉంటుందో ఊహించుకోవాలని మండిపడింది. ఓ అమాయకురాలైన అమ్మాయిపై, మరొకరి కూతురిపై, ఇంకొకరి సోదరిపై ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసి మనస్తాపానికి గురిచేయడం సరైనదేనా? అని ఆలోచించుకోవాలని హితవు పలికింది.’ఇల్లేమో దూరం… అసలే చీకటి గాడాంధకారం… దారి అంతా గతుకులు… చేతిలో దీపం లేదు కానీ, గుండెల నిండా ధైర్యం ఉంది. నేనెప్పుడైనా ఒత్తిడికి లోనైనప్పుడు ఈ మాటలనే గుర్తు చేసుకుంటాను. ఇవి నన్ను చాలా ప్రభావితం చేస్తాయి. ఆ ధైర్యంతోనే మీరు ఇంత దారుణంగా ట్రోల్ చేస్తున్న ధైర్యాంగా ఉన్నా. ఉండగలిగా’ అని అలేఖ్యా ఏంజెల్ వ్యాఖ్యానించింది. కాగా, ఓ క్రైస్తవ భక్తిగీతాల సీడీని జగన్ గత సంవత్సరం తన లోటస్ పాండ్ నివాసంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అలేఖ్య తన కుటుంబ సభ్యులతో సహా హాజరై సెల్ఫీ దిగి, అప్పట్లోనే తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసుకుని సంబరపడింది. ఇటీవల పవన్ కల్యాణ్ వైవాహిక జీవితం గురించి జగన్ వ్యక్తిగత వ్యాఖ్యలు చేసిన తరువాత, పవన్ ఫ్యాన్స్ గత సంవత్సరం ఫిబ్రవరి 18న తీసిన ఈ ఫొటోను తెరపైకి తెచ్చి, జగన్ కు, నటికి సంబంధముందని ప్రచారం చేస్తున్నారు. దీంతో నటి అలేఖ్యా ఏంజల్ పవన్ ఫ్యాన్స్ పై తీవ్రంగా మండిపడింది.

I heard several embarrassing rumours about the selfie with Y.s Jagan garu..The rumours in circulation are completely…

Publiée par Alekhya Angel sur Mercredi 25 juillet 2018

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat