ఇన్ని రోజులు తెలుగు టీవీ చానెళ్లలో.. సోషల్ మీడియాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో కత్తి మహేష్ వివాదం నడిచింది. తరువాత టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న నటి శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ ని పచ్చి బూతులు తిట్టిందని ఆమెపె యుద్దం కొనసాగించారు పవన్ ఫ్యాన్. ఈ వివాదం కొంత కాలాం నడిచింది. తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై జగన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పవన్ కారును మార్చినట్లు పెళ్లాలను మార్చేస్తారు. ఆయన నిత్య పెళ్లికొడుకంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్ అవుతున్నాయి. అయితే ఈ సమయంలో పవన్ ఫ్యాన్స్ పై మరింత సంచలన కామెంట్స్‌తో ఎంటర్ అయ్యింది వివాదాస్పద నటి శ్రీరెడ్డి. ‘వైఎస్ జగన్ గారి జోలికొస్తే తాట తీస్తా’ అంటూ ఫేస్ బుక్‌లో వరుస పోస్ట్‌లు చేసి వివాదాన్ని మరింత రాజేసింది. పవన్ కళ్యాణ్‌కు పెళ్లిళ్లుపై ఉన్న శ్రద్ధ ఏపీ స్పెషల్ స్టేటస్‌పై ఉంటే మోదీ ఎప్పుడో ఇచ్చేసేవారు. మధ్యలో షర్మిళ ఏం చేసిందిరా.. ఆడోళ్ల జోలికొస్తున్నారు ఎదవ మూక’ అంటూ చిరంజీవి ఫ్యామిలీని సైతం వివాదంలోకి లాగింది. ‘తలా తోక లేని జనసేన పార్టీకి నమస్సులు’ అంటూ ఫేస్ బుక్ లైవ్‌లోకి వచ్చి జనసేన పార్టీపైన, ఆ పార్టీ నాయకులపైన ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘జగన్ గారి జోలికొస్తే.. తాట తీస్తా.. నాలుగు పెళ్లాలకు ప్రూఫ్స్ ఉన్నాయి. లక్ష కోట్లకు ప్రూఫ్స్ లేవు. షర్మిలమ్మ భర్త చనిపోతేనే మరో పెళ్లి చేసుకుంది. కాని పుకార్లకు ప్రూఫ్స్ లేవు. ఈ పావలాగాడి రెండో పెళ్లాం మొన్నే రొడ్డెక్కి రెండో పెళ్లికి రెడీ అయ్యింది. ఇక మూడు నాలుగు, ఫాం హౌస్ లెక్కలకు లెక్కేలేదు. ఇన్ని బొక్కలు పెట్టుకుని కూతలు కూస్తే మీ బతుకే కుక్కలు చింపిన విస్తరవుద్ది’ జాగ్రత్త అంటూ ఘోరంగా తిడుతూ పోస్ట్ చేసింది.
