ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ‘ఏపీ బంద్’విజయవంతమైన సందర్భంగా మీడియాతో మాట్టడూతు ప్రముఖ నటుడు, జనసేన అధిపతి పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి క్షణం నుంచి
సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్ అభిమానులు వర్సెస్ పవన్ అభిమానులుగా పెద్ద ఎత్తున మాటల యుద్ధమే జరుగుతోంది. తమ అభిమాన నేతనే అంటారా..? అని జగన్‌పై పవన్
వీరాభిమానులు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ.. వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయితే తామేం తక్కువ కాదంటూ వైఎస్ జగన్ వీరాభిమానులు
సైతం ఓ రేంజ్‌లో కౌంటర్లు పేలుస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే పెద్ద హాట్ టాపిక్. జగన్ ఫ్యాన్స్ ఎమాన్నారో చూద్దాం..సోషల్ మీడియాలో మొత్తం మెజార్టీ జగన్ కే అండగా
నిలుస్తున్నారు. జగన్ చేసిన వాఖ్యల్లో పెద్ద తప్పేమి లేదంటున్నారు. జగన్ వ్యక్తిగతంగా చేసిన వాఖ్యల్లో అపద్దం కాదని వారు కామెంట్స్ పెడుతున్నారు. అంతేకాదు జగన్ పేరు వినగానే
మండిపడే టీడీపీ అభిమానలు సైతం జగన్ కు సపోర్ట్ చేస్తూ..జగన్ సంపూర్ణ మద్దతు తెలుపూతు సోషల్ మాడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.నలుగురు పెళ్లాలు, నిత్య పెళ్లికొడుకంటూ
పవన్ కళ్యాణ్‌పై వైఎస్ జగన్ చేసిన వాఖ్యలు నూటికి నూరు నిజం కాదా అని వారు నిలదిస్తున్నారు. వ్యక్తిత్వంలో నికడ లేదు..మాటల్లో నిలకడ అస్సలు లేదు. నాయకత్వానికి కావలసిన మినిమమ్ ఆర్హతలు లేవు..క్లారీటి అనేది ఎక్కడ లేదు..అతను కాని అతని వెనుక నాయకుల్లో ఒకరి కూడ పారదర్శకత లేదని టీడీపీ అభిమానులు వైఎస్ జగన్ కు సపోర్ట్ చేస్తున్నారు. దీంతో పవన్ అభిమానులు ఢిలా పడ్డారని తెలుస్తుంది.
