నేను పవన్ కళ్యాణ్ అమ్మగారి గురించి మాట్లాడినప్పుడు.. మీ ఫ్యాన్స్ చేత రాళ్లతో కొట్టించి, అల్లర్లు సృష్టించి, ఫిల్మ్ నగర్‌లో లా అండ్ ఆర్డర్‌కు భంగం కలిగేలా ప్రవర్తించిన నీచాతి… నీచమైన చరిత్ర మీది. అంతేకాకుండా, మీ ఫ్యాన్స్ చేత నాపై నానా మాటలు అనిపించి, నాపై దాడి చేయించేందుకు నానా రకాలుగా ప్రయత్నించారు. అటు మీడియా చేత నాపై బ్యాన్ చేయించావు.. అసలు నీవేమి మాట్లాడుతున్నావో.. నీకైనా అర్థమవుతుందా..? పవన్ కళ్యాణ్. మీ పిచ్చి మూక.. ఏం మాట్లాడుతుందో..! వాళ్లకీ అర్థం కాదు. మెగా ఫ్యాన్స్ మొదట చిరంజీవికి భజన చేశారు. చిరంజీవి అడ్రస్ లేకుండా పోవడంతో ఇప్పుడు నీకు భజన చేస్తున్నారు. నీకు కావాల్సింది పబ్లిసిటీ.. నీ ఫ్యాన్స్‌కు కావాల్సింది డబ్బులు. మీ ఫ్యాన్స్ అంతా చప్పట్లు కొట్టే బొమ్మల్లాగా.. మీ పిచ్చి మూకంతా ప్రవర్తిస్తోంది అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌పై శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది.
కాగా, ఇవాళ ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీరెడ్డి మాట్లాడుతూ.. ఆ రోజు మీ అమ్మగారి గురించి మాట్లాడినప్పుడు మీరు మాట్లాడలేక.. మీ ఫ్యాన్స్ చేత నీచాతి నీచంగా మాట్లాడించారు. ఒక పక్క మహిళలంటే గౌరవమంటూ మైక్‌ల ముందు చెబుతూనే.. మరో పక్క పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుంటారు. మైక్‌ల ముందర చెబుతుంటారు.. మహిళల కోసం ఆ విభాగం.. ఈ విభాగం అని ఏర్పాటు చేసి .. చుట్టూరా మహిళలందర్నీ కూర్చోబెట్టి ముచ్చట్లు పెట్టే చరిత్ర పవన్ కళ్యాణ్‌ది.
అటువంటిది నటి అలేఖ్యా ఏంజల్ ఒక నటిగా పాటల సీడీని ఆవిష్కరింపచేసే క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ, సీనీ హీరో విక్టరీ వెంకటేష్‌తోపాటు వైఎస్ జగన్‌ను కలిశారని, అటువంటిది ఆ అమ్మాయికి చంద్రబాబుకు, బాలకృష్ణకు, వెంకటేష్, వైఎస్ జగన్‌కు లింకులు పెడుతూ జనసేన పార్టీ నేతలు, నాయకులు, కార్యకర్తలు పోస్టులు పెట్టడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించింది. జనసేన పార్టీ మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా..? సినీ నటులకు, రాజకీయ నాయకులకు లింకులు పెట్టేందుకే జనసేన పార్టీని స్థాపించారా..? అంటూ శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్‌పై ఫైరైంది. పవన్‌కు మద్దతుగా ఫోటోలు పెట్టుకోవాలనిపిస్తే.. మీ అక్క, చెల్లెళ్ల ఫోటోలు పెట్టుకోండి అంటూ శ్రీరెడ్డి పవన్ ఫ్యాన్స్‌కు సలహా ఇచ్చింది.