ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా తీసుకున్న నిర్ణయంతో భూమా ఫ్యామిలీ గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తోందా..? దీనిపై భూమా ఫ్యామిలీ రియాక్షన్ ఏమిటి..? ఇంతకీ చంద్రబాబు నాయుడు భూమా ఫ్యామిలీకి బిగ్ షాక్ ఇవ్వడానికి కారణం ఏమిటి..? అసలేం జరిగింది..? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే.. ఈ కథనాన్నిపూర్తిగా చదవాల్సిందే.
ఇక అసలు విషయానికొస్తే.. కర్నూలు జిల్లా అసెంబ్లీ టిక్కెట్‌ను వచ్చే ఎన్నికల్లో ఎస్వీ మోహన్‌రెడ్డికి ఇచ్చేందుకు ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎస్వీ మోహన్‌రెడ్డిని గెలిపించాలంటూ టీడీపీ శ్రేణులకు పిలుపుకూడా ఇచ్చారు. ఈ పరిణామం ఇక్కడి నుంచి టిక్కెట్ ఆశిస్తున్న ఎంపీ టీజీ వెంకటేష్ కన్నా కూడా ఎస్వీ మోహన్‌రెడ్డి బంధువులైన భూమా అఖిల ప్రియ ఫ్యామిలీని తీవ్ర ఇరకాటంలోకి నెట్టింది. ఎస్వీ మోహన్‌రెడ్డికి టిక్కెట్ ఖారారు చేయమంటే.. అటు భూమా కుటుంబంలో ఎవరికో ఒకరికి టిక్కెట్ దక్కకపోవడానికి సంకేతమని కర్నూలు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
వాస్తవానికి ఎస్వీ మోహన్‌రెడ్డి కర్నూలు ఎమ్మెల్యేగా, ఈయన మేకోడలు భూమా అఖిల ప్రియ ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్న వీరువైసీపీ నుంచి ఎన్నికై.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆకర్ష్‌కు లోనై టీడీపీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. ఇక భూమా బ్రహ్మానందరెడ్డి నంద్యాల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎస్వీ మోహన్‌రెడ్డికి టిక్కెట్ ఖరారైందన్న విషయం ఇప్పుడు భూమా ఫ్యామిలీకి మింగుడు పడటం లేదు.
మోహన్‌రెడ్డికి టిక్కెట్ ఇస్తున్నారు అంటే.. అఖిల ప్రియ లేదా బ్రహ్మానందరెడ్డిల సీట్లకు ఎసరుపెట్టడమేనని వీరిలో ఎవరో ఒకరికి మొండి చేయి తప్పకపోవచ్చని ఒకే కుటుంబం అనిపించే వీళ్లందరికీ సీట్లు ఇవ్వలేమని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పబోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రత్యేకించి భూమా అఖిల ప్రియకు సీఎం చంద్రబాబు మొండిచెయ్యి చూపినా బ్రహ్మానందరెడ్డికి కూడా నో టిక్కెట్ అన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.