ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో కనీసం పోటీ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందా..? ఈ మాట అన్నది ఎవరు..? ఏ పార్టీకి చెందిన వారు..? ఆ నేత పేరేంటి..? ఏ నేపథ్యంలో ఆ నేత ఈ మాట అన్నాడు. ఈ వివరాలన్నీ తెలియాలంటే.. ఈ కథనం పూర్తిగా చదవాల్సిందే.
వైఎస్ జగన్ సవాళ్లు చెక్కిన శిల్పం. పిట్టకంటి మీద గురి పెట్టిన అర్జునిడిలా, బెసకని సంకల్పానికి ప్రతినిధి సంకల్పమే సగం బలంగా సాగుతున్న ధీరుడు. తీక్షణ ఆలోచన.. తీర్చిదిద్దిన నాయకత్వం వైఎస్ జగన్ సొంతం. మాటలో నిలకడ, చేతలో దూకుడు, అదిలించకుండానే కదిలించగల నేర్పు, కాలగమనం లాంటి కఠిన మార్పును కూడా తట్టుకోగల నేర్పు వైఎస్ జగన్‌ను నేతగానే కాదు నిర్ణేతగాను మలిచాయి.
అందుకే ప్రజల అభిమానం పొందిన వారిలో జగన్‌ను బీట్ చేసే కెపాసిటీ లేదిక్కడ. సిన్సియారిటీతో నేలను తాకాలన్నా చినుకు చూపించే సంకల్ప బలంతో అడుగేసే నాయకులు మనముందు కనిపిస్తారు. పల్లమొచ్చినప్పుడే ఎత్తు కనిపించినట్టు.. పతనమవుతున్న అథములు కనిపించినపపుడే మహోన్నతమైన మనిషి విలువ కూడా అర్థమవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే శిఖరం చేసే సింహనాధం వైఎస్ జగన్ ఈ మాటలు అంటుంది ఎవరో కాదండి ప్రజలే. మరి ప్రజలు ఏమీ ఆలోచించకుండా అనరు కదా..?