పాదయాత్రలో ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్.. జనసేనా అధినేత పవన్ పై చేసిన వ్యాఖ్యలు వెనుక ఒక కాపు సోదరి ఆవేదన ఉంది . తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ ని ఒక కాపు సోదరి తన కుటుంబంతో సహా వచ్చి కలిసి తన గోడు వెళ్లబోసుకొంది . తన భర్త తనకు ద్రోహం చేసాడని, తాను బ్రతికి వుండగానే వేరే మహిళతో కాపురం చేసి పిల్లని కన్నాడని, తన పుట్టింటి వాళ్ళు నీలదీస్తే అదేం తప్పు కాదని పవన్ కళ్యాణ్ కూడా ఇలానే చేసాడని కావాలంటే విడాకులు ఇస్తాను వేరే పెళ్లి చేసుకో అన్నాడని వాపోయింది. జరిగిన దానికి పోలీస్ కంప్లైంట్ ఇవ్వొచ్చు అని కూడా ఆ మహిళకు, ఆమె కుటుంబానికి తెలియదు అని తెలిసి జగన్ ఆశ్చర్యపోయారు. దీనిని bigamy(రెండోపెళ్లిగా) అంటారని, ఇది చట్టవ్యతిరేకం అని చెప్పారు. ఆ కాపు సోదరి ఆవేదనకు కొనసాగింపుగానే నిన్నటి ప్రెస్సుమీట్లో జగన్ చేసిన వ్యాఖ్యలు .
పదిమందికి ఆదర్శంగా ఉండాల్సిన సినిమాహీరో విడాకులు కూడా తీసుకోకుండా పిల్లలు మీద పిల్లల్ని కంటూ కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు ప్రత్యర్ధులు విమర్శిస్తారనే భయంతో అప్పటికప్పుడు కోట్లకి కోట్లు ముట్టచెప్పి విడాకులుకి సర్దుబాటు చేసుకొంటూ ఉంటుంటే అతని ఫాలో అయ్యే అభిమానులు కూడా అదే వరసలో నడుస్తున్నారు .పవన్ కళ్యాణ్ ని ఆదర్శంగా తీసుకొని ఒకతను ఒక కాపు సోదరినికి చేసిన అన్యాయానికి ఎవరు బాధ్యత వహించాలి ?ఒక కాపు చెల్లెమ్మ ఆవేదనని తెలియచెప్పటమే నేరమా ?అసలు ఒకసారి పవన్ కళ్యాణ్ వ్యవహారం గమనించండి , చంద్రబాబు మోడీ కలిసి ఇచ్చిన ప్రతిహామికి నాదీ బాధ్యత అన్నాడు . ఈ నాలుగు సంవత్సరాలలో ఏఒక్కరోజైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని నిలదీశాడా ? చంద్రబాబు కష్టాలలో ఉన్న ప్రతిసారీ బయటకి రావటం బాబుకి మద్దతుగా జగన్ ని విమర్శిస్తూ మాట్లాడటం . ఇన్నిరోజులు ఈయన చేసిన రాజకీయం ఇదేగా ?ప్రభుత్వాలని ప్రశ్నిస్తానని ప్రతిపక్షాన్ని ప్రశ్నించటం అంటే బాబు కి అండగా ఉంటున్నట్లే కదా . అసెంబ్లీ ఎమ్మెల్యేలు రావటం లేదంటున్నాడు , దానికి కారణమైన ఎమ్మెల్యేల కొనుగోళ్ళని మాత్రం ఇంతవరకు తప్పుపట్టలేదు .ఇతనికి పట్టుమని పది నియోజకవర్గాల పేర్లు తెలియదు . ఎవడో ఇచ్చిన స్క్రిప్ట్ చదవటం రెండు రోజులు పిచ్చి అరుపులు అరవటం దక్కినకాడికి జేబులోవేసుకొని వెళ్ళటం .బాధ్యతలేని ఇలాంటి వారిని నమ్మి అమాయకులు మోసపోతున్నారు . సినీ అభిమానులని , తనని నమ్మే కొంతమంది కాపు సోదరులుని చంద్రబాబు లాంటి వారికికి గుండఁగుత్తుగా కుదవ పెట్టి సొమ్ము చేసుకొంటున్నాడు .