అర్జున్‌రెడ్డితో ఆ తరువాత ఆ రేంజ్‌లో సెన్షేషన్ సృష్టించిన మూవీ ఆర్ఎక్స్ 100. ఈ చిత్రంలో హీరోకంటే.. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కే ఎక్కువ పేరొచ్చింది. ఇక అప్పట్నుంచి ఆమెకు ఆఫర్ల వరద మొదలైంది.
సాక్ష్యం చిత్రం తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నచిత్రంలో పంజాబీ ముద్దుగుమ్మపాయల్‌ను సెలెక్ట్ చేశారనే టాక్ వినిపిస్తోంది. అందులో కాజల్ మెయిన్ హీరోయిన్‌గా సెకండ్ హీరోయిన్‌గా పాయల్‌ను ఎంపిక చేశారని సమాచారం.
ఆర్ఎక్స్ 100 చిత్రంతో గ్లామర్‌తోపాటు నటనతోను సినీ ప్రేక్షకులను మెప్పించింది పాయల్‌రాజ్‌పుత్. అందుకే ఆమెను ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి. త్వరలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన పాయల్ కనిపించనుంది.