గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బ్రహ్మలింగం చెరువులో భారీ స్థాయిలో మైనింగ్ చేస్తూ అవినీతి కుంభకోణానికి పాల్పడ్డారని, ఆఖరుకు చంద్రబాబు సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టామని చెప్పుకుంటున్న నీరు చెట్టు కార్యక్రమంలో భాగంగా భారీ ఎత్తున మట్టిని తవ్వి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమ్ముకున్నాడని కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మ అన్నారు. టీడీపీ చేస్తున్న అవినీతి, అక్రమాలపై పోరాడుతున్నందునే.. ఆ పార్టీ నేతలు తనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆమె ఆరోపించారు.
బ్రహ్మలింగం చెరువులో నీవు, నీ టీడీపీ కార్యకర్తలు కలిసి విగ్రహాలు తొలగించింది నిజం కాదా..? అక్కడ మైనింగ్ మాఫియా జరుగుతుంది వాస్తవం కాదా..? మట్టిని క్రేన్‌ల ద్వారా తొలగించింది వాస్తవం కాదా..? నీరు చెట్టు కార్యక్రమం కింద తవ్విన మట్టిని అమ్ముకుంది నిజం కాదా..? కొండపైకి విగ్రహాలను తీసుకెళ్లి.. మైనింగ్ మాఫియా చేస్తూ అటవీ భూముల్లో దారి ఏర్పాటు చేసుకున్న విషయం వాస్తవం కాదా..? కోట్లాది రూపాయలను అక్రమంగా దండుకుంటుంది వాస్తవం కాదా..? అంటూ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై ప్రశ్నల వర్షం కురిపించారు.
పై ప్రశ్నలన్నిటికీ, వల్లభనేని వంశీ పాల్పడిన అవినీతి నా వద్ద ఆధారాలు ఉన్నాయి. ఎమ్మెల్యే వంశీ తనకు నోటీసులు అందజేసినా.. వాటిని నా వద్ద ఉన్న ఎమ్మెల్యే వంశీ అవినీతి ఆధారాలతో ఫేస్ చేస్తా. అలాగే, మీడియా ద్వారా వల్లభనేని మీద వచ్చిన ఆరోపణలు, పేపర్ల ద్వారా వచ్చిన ఆరోపణలు.. ప్రజలు నా వద్ద చెప్పిన ఆరోపణల దృష్ట్యా ఆధారాలను సేకరించిన తరువాతనే మాట్లాడుతున్నా తప్పా..ఇవి ఆరోపణలు కావు.. నిజాలు అంటూ సుంకర పద్మ ఇవాళ మీడియాతో చెప్పారు.