పవన్ కళ్యాణ్‌ను అభిమానించే అమ్మాయిలకు నాది ఒకటే ప్రశ్న..! మీరే పవన్ కళ్యాణ్ భార్య అయి.. తాను మీకు తెలియకుండా వేరొక
మహిళతో సంబంధం పెట్టుకుని తనతో సహజీవనం చేసి, ఇంకో పాపని కని ఉంటే ఏం చేసి ఉండే వారు..? అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రేణుదేశాయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. తనతో విడాకులు తీసుకోకముందే అన్నా లెజీనోవాతో పవన్ కళ్యాణ్ సహజీవనం చేశాడని రేణు దేశాయ్ చెప్పింది. అంతేకాకుండా, పవన్ కళ్యాణ్ మొదటి భార్యతో విడాకులు తీసుకోక ముందే.. తనతో సహజీవనం చేశాడని, వారిద్దరికి బిడ్డ పుట్టిన తరువాతనే పవన్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడని రేణుదేశాయ్ చెప్పుకొచ్చింది.
ఇదిలా ఉండగా, పవన్ కళ్యాణ్, అన్నా లెజీనోవా, పూనమ్ కౌర్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. ఆ వార్త కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పూనమ్ కౌర్, పవన్ కళ్యాణ్‌ల వ్యవహారం గురించి అన్నాలెజీనోవా ఇటీవల సినీ ఇండస్ట్రీలో పరిచయమైన వారి వద్ద వాకాబు చేసిందట. అన్నా లెజీనోవా ఇలా వాకబు చేసిందో లేదో..పూనమ్ కౌర్, పవన్ కళ్యాణ్‌ల గురించి అన్నా లెజీనోవాకు సంచలన విషయాలు తెలిశాయట.
పవన్ కళ్యాణ్‌కు పరమభక్తుడినని చెప్పుకునే నితిన్ హీరోగా తాజాగా తెరకెక్కుతున్న చిత్రం శ్రీనివాస కళ్యాణం. ఈ చిత్రంలో పూనమ్ కౌర్‌కు ఓ కీలక పాత్రలో నటించే అవకాశం కల్పించారు దర్శక నిర్మాతలు. అయితే, టాలీవుడ్లో చాలా మంది యువ హీరోయిన్లు ఉన్నా.. చిత్ర సీమకు ఎప్పుడో దూరమైన పూనమ్ కౌర్‌కు నితిన్ నటించే శ్రీనివాస కళ్యాణం చిత్రంలో కీలక పాత్ర ఇవ్వడంపై పలు రూమర్లు వెల్లువెత్తుతున్నాయి.
పూనమ్ కౌర్‌కు నితిన్ సినిమాలో కీలక పాత్ర పోషించే అవకాశం రావడం వెను.. పవన్ కళ్యాన్ రెకమెండేషన్.. నితిన్ మధ్యవర్తిత్వం ఉన్నట్టు సమాచారం. ఎలాగో తన భక్తుడు నితిన్ హీరో కాబట్టి.. తన మాటను జవదాటడనే నమ్మకంతో పవన్‌కళ్యాన్ పూనమ్ కోసం ఓ కీలక పాత్రను అడగగా.. అందుకు నితిన్ దర్శక నిర్మాతలను ఒప్పించినట్టు సమాచారం.
పై విషయాలద్వారా పూనమ్ కౌర్ – పవన్ కళ్యాణ్‌ల భాగోతాన్ని తెలుసుకున్న అన్నా లెజీనోవా ఒక్కసారిగా కన్నీరు మున్నీరైందట. దీంతో ఓ పది నిమిషాలపాటు ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉండిపోయిందట. చివరకు ఆషాకింగ్ న్యూస్ నుంచి తేరుకుని.. పవన్‌తో విడాకులు తీసుకునేందుకు డిసైడ్ అయిందని సమాచారం. ఆ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ఇంటికి రాగానే నీకు మెంటల్.. అమ్మాయిల పిచ్చి.. నాకు వెంటనే విడాకులు కావాలి.. అంటూ పవన్ కళ్యాణ్‌పై ఫైరైందట.