తెలుగు సినీమా ఇండస్ట్రీలో బయోపిక్ ల పరంపర కొనసాగుతుంది. నిన్న కాక మొన్న ప్రముఖ సీనియర్ నటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కి ప్రేక్షకుల ముందుకొచ్చిన మహానటి కలెక్షన్ల వర్షంతో బాక్స్ ఆఫీసు దగ్గర సునామీ సృష్టించిన సంగతి తెల్సిందే..
తాజాగా అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత సీఎం ,మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి కూడా తెల్సిందే.. అయితే ఈ క్రమంలో మరో బయోపిక్ వస్తుంది.. తెలుగు సినీమా ఇండస్ట్రీలో మహానటులు ఎన్టీఆర్,ఏఎన్ఆర్ లతో ధీటుగా సమానంగా నటించి మంచి పేరు తెచ్చుకున్న సీనియర్ హీరో కత్తి కాంతారావు.
ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ప్రముఖ దర్శ్జకుడు డా.పీసీ ఆదిత్య ఒక చిత్రాన్ని తీస్తున్నట్లు తెలిపారు..ఇప్పటికే ‘చీకటి వెలుగుల సంగ్రామం – చిత్రసీమలో నీ పయనం- కాంతారావు నీ కీర్తికి అంతంలేదు’ అనే టైటిల్ సాంగ్‌ను ఇప్పటికే
యూ ట్యూబ్‌లో అభిమానుల కోసం అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. .