ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ప్రత్యేక హోదా సాధిస్తామని వైసీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఇచ్చిన బంద్‌లో పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో విలేకరులతో మాట్లాడుతూ..ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే కేంద్రంలో మద్ధతు ఇస్తామని స్పష్టం చేశారు. నాలుగేళ్లుగా ఏపీ ప్రజలను సీఎం నారా చంద్రబాబు నాయుడు మోసం చేస్తూనే ఉన్నారని విమర్శించారు.చంద్రబాబుకు ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి లేదని అన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధే ఉంటే ప్రత్యేక హోదా కోసం బంద్ నిర్వహిస్తున్న వైసీపీ నేతలను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలని చిత్తశుద్ధితో వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి ఆమోదింప చేసుకున్నారని వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలంటే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చెయ్యాలని చెప్పారు
