ఎన్నికలకోసం వైసీపీ అధినేత వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.దీనికోసం అన్ని అవకాశాలను వినియోగించుకోవాలని చూస్తున్నారు. బ్రతకండీ,బ్రతకండీ అంటే వినలేదు కదా..ఇప్పుడు కోత మొదలైంది. రాత రాసిన ఆ భగవంతుడు వచ్చిన ఆపలేడు..అనే డైలాగ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చెవులు దద్దరిల్లేలా వినిపిస్తుంది. భారీగా ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు క్యూ కడుతున్నారు. 2014 ఎన్నికల్లో మోసపోయామని భావిస్తున్న వారు, ఇప్పుడు ఏపీకీ చంద్రబాబు,మోదీలు అన్యాయం చేసారని అనుకుంటున్న వారంతా వైసీపీలో వలస వెళుతున్నారు. ఇటీవలనే నెల్లూరు జిల్లా టీడీపీకి షాకిస్తూ, మాజీ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి వైఎస్ జగన్ తో భేటీ కావడంతో ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. దీంతో అధికార టీడీపీలో అలజడి మొదలైంది. అసలేం జరుగుతుందా అన్న అనుమానం టీడీపీ నేతలను ఉలిక్కిపాటుకు గురిచేస్తుంది.
మొన్నటిదాకా ప్రతిపక్ష పార్టీ నుంచి వలసలు ఉంటే, ఇప్పుడు అందుకు విరుద్ధంగా అధికార పార్టీ నేతలే ప్రతిపక్ష గూటికి చేరుతుండటం సీఎం చంద్రబాబుకు, మంత్రులకు మింగుడు పడటం లేదు. నేతలు పార్టీ మారకుండా ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా టీడీపీ నేతలు చేతులెత్తేస్తుండటంతో తలపట్టుకుంటున్నారట సీఎం చంద్రబాబు.అంతేకాదు టాలీవుడ్ నుంచి కూడా ఈసారి జగన్ కు, వైసీపీకి విపరీతమైన మద్దతు వస్తోంది. సూపర్ స్టార్ కృష్ణ ..కృష్ణా జిల్లాలో వైసీపీ నుండి మరిలోకి దిగుతున్నట్లు సమచారం. అంతేకాదు తమిళ హీరోలు సూర్య, విశాల్, అలాగే తెలుగు ఇండస్ట్రీ నుంచి పోసాని కృష్ణమురళి, థర్టీ ఇయర్ ఇండస్ట్రీ పృథ్వీ, సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు తదితరులంతా జగన్ పాదయాత్రకు మద్దతును ప్రకటిస్తూ, జగన్ తో కలిసి ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొన్నారు. ప్రజాసంకల్ప యాత్రను చూస్తుంటే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీ ఖచ్చితంగా అధికారంలోకి రావడం ఖాయం అని ఆశాభావం వ్యక్తం చేశారు.సినీ ఇండస్ట్రీ నుంచి రోజురోజుకీ జగన్ కు బారీగా మద్దతు పెరుగుతుంది. పరోక్షంగా నందమూరి హరికృష్ణ, హీరో నాగార్జునలు,మంచు మోహన్ బాబు కుటుంబం కూడా జగన్ కే జై కొడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లోగా హరికృష్ణ వైసీపీ గూటికి చేరతారన్న ప్రచారం ఈ మధ్య పెద్ద ఎత్తున జరుగుతుంది. అనంతపురం జిల్లానుండి పోటి చేస్తారని ఓ వార్త చక్కర్లు కొడుతుంది. ఇది కనుక జరిగితే అనంతలో జగన్ కు తిరుగులేదు అంటున్నారు. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ను అనేక సంఘటనలు కుదిపేస్తున్నా సీఎం చంద్రబాబు కానీ, టీడీపీ నాయకులు కానీ ఎవరూ పట్టించుకోవడం లేదని, తమపై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు మరింత బాధించాయని సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకు దూరమౌతూ, ఒక్కొక్కరుగా జగన్ గూటికి చేరుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.