ఆంధ్రప్రదేశ్ మహిళలు ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కి నీరాజనాలు పలుకుతున్నారు. మహిళల ఆత్మగౌరవాన్ని పెంచే వ్యాఖ్యలు చేసినందుకు జేజేలు పలుకుతున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఇంత శ్రద్ద చూపిన జగన్ అధికారంలోకి వస్తే తమ గురించి మరింత ఆలోచిస్తారని హర్షం వ్యక్తం చేస్తున్నారు. జనసేనాని పవన్ కల్యాణ్ పై జగన్ చేసిన వ్యాఖ్యలు నూటికి నూరు శాతం నిజమని అంటున్నారు. నలుగురు మహిళలను పెళ్లి చేసుకుని వారికి విడాకులిచ్చిన పవన్ కల్యాణ్ నైతికతను జగన్ ప్రశ్నించారు. ఇలాంటి వారు చేసిన వ్యాఖ్యలపై స్పందించడం తన ఖర్మని ఆవేదన వ్యక్తం చేసారు. కార్లు మార్చినట్లుగా భార్యలను మార్చడం – ఆ చర్యను సమర్దించుకోవడం దారుణమని ఎద్దేవా చేసారు. ఈ జగన్ ప్రతిస్పందనపై ఆంధ్రప్రదేశ్ అంతటా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా మహిళా లోకం జగన్ ను ఆకాశానికెత్తుతోంది. రాజకీయాలలో ఏ నాయకుడికైన నైతికత అవసరమని పవన్ కల్యాణ్ కు అది వీసమంతైనా లేదని మహిళలు దుయ్యబడుతున్నారు.
పవన్ కల్యాణ్ మాటిమాటికీ తన వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలలోకి తీసుకురావద్దంటూ ప్రకటించడాన్ని కూడా వారు తప్పుపడుతున్నారు. ఈ సందర్భంగా మహాకవి శ్రీశ్రీ పద్య ఫంక్తులను ఉదహరిస్తున్నారు. “వ్యక్తుల ప్రైవేటు బతుకులు వారి వారి సొంతం…..పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం ” అన్న మహాకవి పద్య ఫంక్తులు పవన్ కల్యాణ్ జీవితానికి అతికినట్లు సరిపోతాయని వ్యాఖ్యనిస్తున్నారు. తనకు కవులు గుంటూరు శేషేంద్ర శర్మ – కాళోజీ – తిలక్ వంటివారు ఆదర్శప్రాయులని చెప్పే పవన్ కల్యాణ్ ఆ ముగ్గురు కవులకు ఆదర్శప్రాయుడైన శ్రీశ్రీ మాటలను ఎలా పరిగణిస్తారని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ నాయకుల అవినీతి కంటే వారి నైతికతే ప్రజలకు ముఖ్యమని దాని ఆధారంగానే తమ నాయకుడిని ఎన్నుకుంటారని అంటున్నారు.