జనసేన అధినత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాను స్థాపించిన పార్టీ సభా కార్యక్రమాల్లో, ప్రజలను ఉద్దేశించి మాట్లాడే సమయంలో, తాను చేసిన తప్పులు గుర్తుకు రాకపోగా, దేశాన్ని రెండు భాగాలుగా విడగొట్టాలంటారు. నార్త్ ఇండియా అంటే ద్వేషమంటాడు. మళ్లీ దేశమంటే తనకు ప్రేమ అంటాడు. మరొక పక్క లోకల్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. అది చాలక, తాను ద్వేషించిన నార్త్ ఇండియా నుంచి మరో అమ్మాయిని వివాహమాడతాడు. పోనీ అక్కడితో సరిపెట్టుకున్నాడా..? లేదే..! మూడో సారి ముచ్చటగా ఏకంగా కంట్రీనే మార్చేసి మూడో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్‌కు టాలీవుడ్‌లో ఓ ప్రముఖ హీరోయిన్‌తో ఎఫైర్ ఉందని, ఇటీవల ఫోటోలు కూడా విడుదలయ్యాయి. అటువంటిది నీవు అధికారంలోకి వచ్చి ఏపీలోని మహిళలకు రక్షణగా ఉంటావా..? చ‌్ఛి.. చ్ఛీ..! నీవెంత..? నీ బతుకెంత..? అంటూ రాజశేఖర్ అనే వ్యక్తి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
అయితే, రాజశేఖర్ తాను పోస్ట్ చేసిన వీడియోలో పవన్ కళ్యాణ్ గురించి ఈ విధంగా పేర్కొన్నాడు. జనసేన పార్టీ సభల్లో పవన్ కళ్యాణ్ ఏపీ మహిళల ఔన్నత్యం గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. స్ర్తీల గురించి పవన్ మాట్లాడుతుండగా.. వినేటటువంటి దౌర్భాగ్యం పట్టిందన్నారు. నాడు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మెగా అభిమానులను కాంగ్రెస్‌కు అమ్మేస్తే.. నేడు పవన్ కళ్యాన్ అదే అభిమానులను టీడీపీకి వేలకోట్ల రూపాయలకు అమ్మేశారన్నారు.