క్యాస్టింగ్ కౌచ్ అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన నటి శ్రీరెడ్డి.. క్యారెక్టర్ ఆర్టిస్టు దగ్గర నుండి స్టార్ హీరో వరకు.. ప్లే బ్యాక్ సింగర్ దగ్గర నుండి మ్యూజిక్ డైరెక్టర్ వరకు.. లైట్ మెన్ దగ్గర నుండి స్టార్ దర్శకుడు వరకు ఇలా అందర్నీ ఏకిపారేసింది అమ్మడు. అంతటితో ఆగకుండా తాజాగా ఆమె కోలీవుడ్ పై పడింది.
ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు అయిన ఏఆర్ మురుగదాస్ ,సుందర్ .సి, నటుడు శ్రీకాంత్ వరకు అందరూ నాకు అవకాశాలిస్తామంటూ నన్ను వాడుకున్నారు అని ఆమె సంచలన ఆరోపణలు చేస్తూ మరోసారి తెరపైకి వచ్చారు.
శ్రీరెడ్డి కోలీవుడ్ ఇండస్ట్రీపై చేసిన వ్యాఖ్యలు గురించి నటుడు వారాహి ఆమెపై చెన్నై కమీషనర్ కార్యాలయంలో పిర్యాదు చేశారు కూడా.. తాజాగా సీనియర్ దర్శకుడు భారతీరాజా స్పందిస్తూ శ్రీరెడ్డి ఇష్టంతోనే అలాంటివన్నీ జరిగాయి .ఇలాంటప్పుడు ఆమె ఇప్పుడు వాటిని బయట పెట్టి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు .సినీమావాళ్ళందర్నీ తప్పు పట్టడం సరైన పద్ధతి కాదని ఆయన
ధ్వజమెత్తారు..