సినిమా అవకాశాల కోసం నేను చేసింది వ్యభిచారమైతే.. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న నిన్నేమనాలి..? అంటూ జనసేన అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను సినీ నటి శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసింది. కాగా, సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పేరుతో హీరోయిన్లకు, నటీమణులకు వేధింపులు ఎక్కువ అయ్యాయని, వాటిని అరికట్టాల్సిన స్టార్ హీరోలు, బఢా నిర్మాతలు, ప్రముఖ దర్శకులు ఏమీ తెలియనట్టు ఉండటం సమాజానికి మంచిది కాదంటూ నటి శ్రీరెడ్డి ఇటీవల పలు సమావేశాల్లో చెప్పడంతోపాటు.. సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
అంతేకాకుండా, టాలీవుడ్ బఢా నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు అభిరామ్ సినీ అవకాశాలు కల్పిస్తానని మోసపూరిత మాటలతో తనను లొంగదీసుకున్నాడని, లైంగికంగా వాడుకున్నాడని చెప్పడమే కాకుండా.. ఫోటోలను ఆధారాలుగా చూపుతూ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇక ఆ తరువాత జరిగిన విషయాలు పాఠకులకు విధితమే.
ఇదిలా ఉండగా, ఇటీవల కాలంలో తనను టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులను ట్రోల్ చేస్తున్నారని, వ్యభిచారినని కొందరు, ఇప్పటి వరకు ఎంత మంది వద్ద పడు..న్నావే..? అంటూ మరికొందరు.. పవన్ ఫ్యాన్స్ తన ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం తనను ఎంతో బాధించిందన్నారు. అవును, నేను పడుకున్నది నిజమే.. అదీ.. సినిమా అవకాశాల కోసమే.. అటువంటిది నేను చేసింది వ్యభిచారమే అయితే.. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కళ్యాణ్‌ను ఏమనాలి అంటూ శ్రీరెడ్డి ప్రశ్నించింది. ఇలా శ్రీరెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.