తమిళనాడు దివంగత సీఎం జయలలిత గురించి ఒక షాకింగ్ వార్త వెలుగులోకి వచ్చింది.ఈ వార్త ఏమిటంటే గత కొంతకాలంగా తాను జయలలిత కుమార్తెను అంటూ కర్ణాటక రాష్ట్రానికి చెందిన బెంగుళూర్ యువతి వాదనలు వినిపిస్తున్న సంగతి తెల్సిందే.. బెంగుళూరు కి చెందిన అమృత అనే యువతి తాను జయలలితకు జన్మించాను అని చేస్తున్న ప్రచారాన్ని తమిళ
ప్రభుత్వం తోసిపుచ్చింది.
ఈ కేసుపై హైకోర్టులో ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది విజయ్ నారయణ్ మాట్లాడుతూ జయలలిత తన జీవితంలో ఎప్పుడు గర్భం దాల్చలేదు.. యువతి ఆస్తి కోసమే ఈ విధంగా తను జయలలిత కుమార్తెను అని ప్రచారం చేసుకుంటుంది.
యువతి చెప్పినట్లుగా 1980లో సదరు యువతి జన్మిస్తే ఆమె పుట్టిన రోజుకు ముందు నెలలో జరిగిన ఒక అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి జయలలిత హజరయ్యారు. కానీ అప్పుడు ఆమె ఎటువంటీ అధారాలు లేవు.. ఆ వీడియోలో జయలలిత గర్భం దాల్చినట్లు ఎక్కడ లేదని ఆయన తన వాదనలు వినిపించారు.. అయితే ఈ కేసు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది కోర్టు..