సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణపై జనసేన అధినేత పవన్ కళ్యాన్ మరో ఫైరయ్యారు. బాలకృష్ణను ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారాయి. కాగా, మంగళవారం గోదావరి జిల్లా బీమవరం ఆక్వా రైతుతో పవన్ కళ్యాణ్ సమావేశమైన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే బాలకృష్ణపై పవన్ కళ్యాన్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది.
ఇక అసలు విషయానికొస్తే.. భీమవరంలో ఆక్వా రైతులతో సమావేశమైన పవన్ కళ్యాణ్‌ను జనసేన పార్టీ కార్యకర్తలు కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తాము ఊళ్లల్లో బైక్‌ల మీద తిరుగుతుంటే.. పోలీసులు అడ్డుకుంటున్నారని, అక్రమ కేసులను తమపై బనాయిస్తున్నారని పవన్‌తో చెప్పుకున్నారు.
వారి ఆవేదనను విన్న తరువాత స్పందించిన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఇంట్లో తుపాకీతో కాల్చి బయట తిరుగుతున్నవారిపై చర్యలు తీసుకోకుండా.. బైక్‌ల సైలెన్సర్ తీసి శబ్దం చేస్తే అదేదో పెద్ద నేరం చేసినట్టు చూడటం టీడీపీ సర్కార్ దుర్మార్గపు చర్యలకు నిదర్శనమని ఏపీ సీఎం చంద్రబాబు, బాలకృష్ణలపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్నే పేర్కొంటూ జనసేన మీడియా హెడ్ హరి ప్రసాద్ పత్రికా ప్రకటనను విడుదల చేశారు.
అయితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బాలకృష్ణ ఇంట్లో తుపాకీ కాల్పుల ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రముఖ సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాకుండా, ఇటీవల చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడిన పవన్ కళ్యాణ్.. 2014 ఎన్నికల్లో 60 – 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తామంటే చంద్రబాబు తనను తప్పుదోవ పట్టించాడని, మీరు పోటీ చేస్తే ఓట్లు చీలుతాయి.. మీ సభ్యులను రాజ్యసభకు పంపించే బాధ్యత నాది అని చంద్రబాబు నమ్మబలికాడని పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.