వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ నన్నపునేని నరేందర్ ను మంత్రి కేటీఆర్ అభినందించారు. హైదరాబాద్ లోని హరిత ప్లాజాలో తెలంగాణ పురపాలక శాఖ వార్షిక ప్రణాళికను మంత్రి కేటీఆర్ బుధవారం విడుదల చేసారు.ఈ సమావేశానికి వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా కార్పోరేషన్ల మేయర్లు,కమీషనర్లకు సూచనలు చేస్తూ వరంగల్ మేయర్ నరేందర్ ను ఈ సందర్బంగా అభినందించారు.
నగరంలో చేపడుతున్న పలు కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్ కొన్నీంటికి సమావేశంలో ప్రస్థావించారు.వరంగల్ నగరపాలక సంస్థ లో ODF అమలు తీరును కేటీఆర్ అభినందించారు.ODFప్లస్ దిశగా వరంగల్ నగరపాలకసంస్థ దూసుకెల్లడాన్ని మంత్రి ప్రశంసించారు.
నగరపాలకసంస్థ నిర్వహిస్తున్న మానవ వ్యర్ధాల శుద్దికరణ ప్లాంటు నిర్వహణను ,అలాగే మరో 5 మానవ వ్యర్ధాల శుద్దికరణ ప్లాంట్ల ఏర్పాటు చేయబోతున్న సందర్బంగా మేయర్ ను కేటీఆర్ గారు అభినందించారు.దేశంలోని పెద్ద పెద్ద నగరాలతో వరంగల్ మహానగరం పోటీ పడుతుందని,ఆదిశగా అన్ని మున్సిపాలిటీలు,నగరపాలక సంస్థలు ఆలోచన చేయాలని కితాబిచ్చారు.