తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ( జూలై 24 ) జన్మదినాన్ని పురస్కరించుకుని ఎన్నారై తెరాస యూకే సెక్రటరీ చాడ సృజన రెడ్డి మైత్రి అనాధ శరణాలయం లో పిల్లలతో కేటీర్ జన్మ దిన వేడుకలను ఘనంగా జరిపించారు. కేటీర్ సూచన మేరకు హంగు ఆర్భాటాలకు పోకుండా మైత్రి అనాధశరణాలయం లో అన్నదానం నిర్వహించి పిల్లలతో హరితహారం లో భాగంగా చెట్లు నాటించి జన్మదిన వేడుకలను జరుపుకున్నారు.
ముఖ్య అతిధి గా విచ్చేసిన పాటిమీది జగన్మోహన్ రావు మాట్లాడుతూ పిల్లలు చాలా హుషారుగా మొక్కలు నాటారు అని పిల్లలకు మొక్కల పట్ల ఉన్న ప్రేమం యూ కొనియాడారు. పిల్లలను చూసి పెద్దలు కూడా ఉత్సాహంగా హరిత హారం లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఎన్నారై తెరాస యూకే సెక్రటరీ చాడ సృజన రెడ్డి గారు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు ఈ బాలలు నాటుతున్న నేటి మొక్కలే రేపటి వృక్షాలు అయ్యి మనకు నీడ నిస్తాయి అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ కూడా చేయాలి అని పిల్లలకు చెప్పారు. అందరు మెక్కలు పెంచడం అలవాటు చేసుకోవాలి అని సృజన రెడ్డి గారు సూచించారు.
ముఖ్యఅతిథి గా విచ్చేసిన పాటిమీది జగన మోహన్ రావు కి కృతజ్ఞతలు తెలిపారు సృజన రెడ్డి . తాను లండన్ లో ఉన్నా కూడా కేవలం ఒక్క ఫోన్ కాల్ తో తనకు సహాయం చేసిన నజీర్ మొహమ్మద్ అతని మిత్రులకు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలిపారు.