జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెల్సిందే.అయితే జగన్ పై పవన్ చేసిన వ్యాఖ్యలకు దిమ్మతిరిగే సమాధానాలిచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు .. మీరు ఒక లుక్ వేయండి..
నువ్వు.. వీటికి సమాధానం చెప్పగలవా
పాలకుడు అవినీతి పరుడైతే ప్రజలపై ప్రభావం ఉంటుందని అందుకే వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు గత ఎన్నికల్లో మద్దతు ఇవ్వలేదు
– కోర్టులు జగన్ అవినీతి పరుడని ఎక్కడైనా చెప్పాయా..
సోనియాను ఎదిరించడం వలనే జగన్ జైలుకు వెళ్లాల్సి వచ్చిందని చంద్రబాబు సహా, ఆయన మీద కేసులు పెట్టిన నాయకులు చెప్పింది నీకు తెలియదా. రాజకీయాలను క్షుణ్నంగా ఫాలో
అవుతున్నానని చెబుతున్నావే. ఇదేనా నీ జ్ఞానం.
—-
జగన్ లాంటి వ్యక్తిని సమర్థిస్తే నేను కూడా అలా అవుతానేమోనని భయం వేసింది
– నిజమా.. 2014లో నువ్వు సమర్థించి.. చేతిలో చెయ్యేసి.. భుజాలు భుజాలు రాసుకు పూసుకుని చంద్రబాబుతో తిరిగావ్. నాలుగేళ్లుగా ఏం పొడిచాడో చూస్తున్నావ్‌గా. ఏ ఒక్క ఎన్నికల
హామీనైనా నెరవేర్చాడా. పోలవరం, అమరావతి, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంటు, కాపుల రిజర్వేషన్లు, నిరుద్యోగ భృతి వంటి ఎన్నికల హామీలు ఏమయ్యాయి. అడక్క పోయావా.
గోదావరి మెగా ఆక్వాఫుడ్ బాధితులను, ఉద్దానం కిడ్నీ బాధితులను, రాజధాని రైతులను ఉద్ధరిస్తానని నువ్వూ తిరిగావ్‌గా. వారికి నువ్వు ఏం చేశావ్.
——
తండ్రి సీఎం అయితే తాను కూడా ముఖ్యమంత్రి కావాలని అనుకోవడం అవివేకం. ఇది ప్రజాస్వామ్యమా?.. రాచరికమా?
– అడ్డదారిలో అర్హత లేని.. అసమర్థుడైన లోకేష్‌ని మంత్రిని చేస్తే నీకప్పుడు నోరు పెగల్లేదే..
ఇంకో ముఖ్య విషయం. జగన్ నిరూపించుకున్న నాయకుడు. సొంతంగా ప్రతిపక్ష నేతగా ఎదిగారు. గెలవాల్సిన వ్యక్తి మొదటి ప్రయత్నంలోనే కేవలం 2 శాతం ఓట్లతోనే ప్రతిపక్షానికి
పరిమితమయ్యారు. ఎందుకో నీకు చెప్పాల్సిన పనిలేదనుకుంటా.
—–
రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి దోచుకున్న, లంచాలు తీసుకున్న వ్యక్తి అయితే మొత్తం సమాజం అలా తయారయ్యే అవకాశం ఉంది. అందుకే అన్ని వేల కోట్ల అవినీతి చేసిన వ్యక్తి
(జగన్)ని సమర్ధించాలనిపించలేదు.
– అందుకేనా లక్షలు కోట్లు మింగేసి దర్జాగా ప్రత్యేక విమానాల్లో తిరిగే వాడితో దోస్తీ కట్టావ్.
900 కోట్లతో కట్టిన తాత్కాలిక సచివాలయం ఎలా ఉందో చూశావువా. చిల్లుల కొంపకు అంత ఖర్చు ఎందుకైందని నిలదీశావా.
మూడేళ్లలో తెచ్చిన లక్షా 20 వేల కోట్లకు అప్పులకు లెక్కలు చెప్పమని అడగాలని అనిపించలేదా. ఆ డబ్బు ఏం చేశాడో అడక్కపోయావా.
ఓటుకు నోటు కేసులో డబ్బులు పంచుతూ చంద్రబాబు అడ్డంగా బుక్కయిన తర్వాత.. నువ్వు ఎన్నిసార్లు వెళ్లి చంద్రబాబును కలవలేదు.
అప్పుడు నీ విజ్ఞత ఏమైంది. నీ మైండుని మడిచి పాకెట్లో పెట్టుకున్నావా.
ఒక్కరోజైనా చంద్రబాబు అవినీతి మీద నీ నోరు లేచిందా..
జగన్ అవినీతి చేశాడని ఏ ఒక్క కోర్టయినా తీర్పు చెప్పిందా..
ప్రశ్నించడానికే వచ్చానని అన్నావ్… 18 కేసుల్లో విచారణకు వెళ్లకుండా స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు నీకు కడిగిన ముత్యంలా కనిపించాడా
—
జగన్‌పై నాకు ఎలాంటి ద్వేషం, వైరం లేదు
– ఈ మాట నిజమైతే విశాఖలో ప్రత్యేక హోదా కోరుతూ కొవ్వొత్తుల ర్యాలీ చేస్తుంటే .. యువకులు స్వచ్ఛందంగా ఇచ్చిన పిలుపుకు జగన్ హాజరవుతుంటే నువ్వు ఎక్కడున్నావ్.
జగన్‌ను ఎయిర్‌పోర్టులో అరెస్టు చేస్తే నువ్వు ఎందుకు ఖండించలేదు.
జగన్‌తో కలిసి ఆరోజే ప్రత్యేక హోదా కోసం కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొని ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేది.
తప్పు నీదా.. జగన్‌దా
—–
రాజకీయ నేతల పిల్లలు పొలిటిక్స్‌లోకి రాకూడదని చెప్పలేదు. నిజాయితీని నిరూపించుకుని రావాలి
-మంత్రి పదవిలోకి రాకముందే చేసిన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎన్ని దందాలు చేశాడో పేపర్లలో చదవలేదా.
కనీసం తెలుగులో ప్రమాణ స్వీకారం కూడా చేయలేని వ్యక్తి లోకేష్‌లో ఏం నిజాయితీ నీకు కనిపించింది.
జయంతికి వర్ధంతికి తేడా తెలియని వ్యక్తి మనకు మంత్రా.. సిగ్గనిపించలేదా నీకు
—–
నాకు ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక లేదు. ప్రజా సేవ చేస్తా. అవసరమైతే పాదయాత్ర చేస్తా.
నిజమే.. నీకు ఆ సత్తా లేదని మాకూ తెలుసు. నీకూ తెలుసు.
అందుకే చంద్రబాబుకు రహస్య మిత్రుడిగా పనిచేస్తున్నావ్. అప్పట్లో కిరణ్‌కుమార్ రెడ్డి పాత్రను ఇప్పుడు నువ్వు పోషిస్తున్నావ్. మనుషులే మారారంతే. చంద్రబాబు వాడకం మారలేదు.
రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు నువ్వు చీలిస్తే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న చంద్రబాబు చేతిలో నువ్వు ఆయుధం.
—-
పాదయాత్ర చేస్తే సీఎం అవుతారా..?
పాదయాత్ర చేసి సీఎం అవుతానని జగన్ నీతో చెప్పాడా.
నీ రహస్య మిత్రుడు చంద్రబాబును అడిగి చూడొకసారి. ఆయన కూడా గతంలో పాదయాత్ర చేశాడుగా. పాదయాత్రలతోనే సీఎం అయ్యేట్టుంటే మోడీతో, నీతో ఆయనకు పనేముంది. 600
దొంగ హామీలు ఆనాడు బాబుకు అవసరమయ్యేవా. కులాల మధ్య కుంపట్లు రాజేయాలని చూసేవాడా.
——
లండన్‌లో ఒక అభిమాని చెప్పిన సంఘటన నన్ను బాగా కదిలించింది..
– అవును.. ఆంధ్రజ్యోతి ఆఫీసుకి మంటలంటుకుంటే వెళ్లి పరామర్శిస్తావ్. నారాయణ కొడుకు చనిపోతే ఓదారుస్తావ్.
అదే నారాయనలో ఇప్పటికే వందల మంది చనిపోతే ఒక్క విద్యార్థి ఇంటికైనా వెళ్లి పరామర్శించావా
గోదావరి పుష్కరాల్లో 29 మంది తొక్కిసలాటలో చనిపోతే నీ మనసు రాయి చేసుకున్నావా
జేసీ దివాకర్ బస్సు ప్రమాదంలో చనిపోయిన వారు గుర్తుకు రాలేదా
ఏర్పేడులో లారీ ఢీకొని 11 మంది చనిపోతే ఎక్కడికెళ్లావ్
మొన్ననే విజయవాడలో బోటు ప్రమాదంలో 22 మంది చనిపోతే నీ కాళ్లు గుమ్మం దాటకపోయెనే..
చెప్పు సారూ.. నువ్వు ప్రశ్నించింది ఎక్కడ..
రాజకీయాల్లోకి వచ్చి జనాలకు నువ్వేం న్యాయం చేస్తావ్
ప్రజల క్షేమం కోరుకున్నవారే సీఎం అవుతారు
– ప్రజల క్షేమం కోరుతున్నది ఎవరు..
నీ మిత్రుడు చంద్రబాబా, ప్రతిపక్ష నాయకుడు జగనా
జనానికి సమస్య వచ్చినప్పుడు పలకరించే jమొదటి గొంతు జగన్‌ది కాదా
బాధితుల గడప తొక్కే మొదటి అడుగు జగన్‌ది కాదా ..
నీ మనస్సాక్షిని అడుగు…నిజం నీకే తెలుస్తుంది. అని జగన్ అభిమానులు దిమ్మతిరిగే సమాధానాలిచ్చారు..