నాతో కలిసి పదకొండేళ్లపాటు కాపురం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాకు తెలియకుండానే మరో ఇద్దరు మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అందులో ఒక మహిళతో అక్రమ సంబంధం నెరిపిన పవన్ కళ్యాణ్ ఒక బిడ్డకు జన్మనిచ్చాడు కూడా. ఆ కారణంగానే పవన్ కళ్యాణ్, నేను విడిపోవాల్సి వచ్చింది అని చెప్తూ పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణుదేశాయ్ కన్నీటి పర్యంతమైంది.
కాగా, ఇటీవల ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రేణుదేశాయ్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్‌పై, ఫ్యాన్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. పవన్‌కు, తనకు మధ్య విడాకుల విషయంలో తన తప్పేమీ లేకున్నా.. పీకే ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో తన ఫోటోలతో ట్యాగ్ లైన్ పెట్టి ట్రోల్ చేయడం తనను బాధిస్తోందన్నారు రేణుదేశాయ్. నాకంటూ ఒక జీవితం ఉండాలి.. పెళ్లి చేసుకోవాలి.. భర్తతోనే చావాలి అనేది నా ఆలోచన.. కానీ పవన్ కళ్యాణ్ చేసిన పనులతో ఒకానొక సమయంలో తన జీవితంపై తనకే విరక్తి పుట్టిందని ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది రేణు దేశాయ్.