Home / SLIDER / ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం ఆసీఫాబాద్ జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్..!!

ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం ఆసీఫాబాద్ జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్..!!

ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం ఆసీఫాబాద్ జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హమీ మేరకు 18 కొత్త చెరువులకు ఇవాళ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. 4539 ఎకరాలకు ఈ కొత్త చెరువుల ద్వారా నీరందనుంది. ఈ 18 కొత్త చెరువుల స్టేజ్ -1 అనుమతుల కోసం 23.42 కోట్లు మంజూరు చేసింది. స్టేజ్ -1 అనుమతుల్లో భాగంగా ఈ కొత్త చెరువుల భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ పనులను చేపట్టనున్నారు.

వివరాల్లోకి వెళితే… ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని కార్కి గ్రామంలో 150 ఎకరాలకు సాగు నీరిచ్చే కొత్త చెరువును ప్రభుత్వం మంజూరు చేసింది. అదే మండలంలో మరో 100 ఎకరాలకు నీరిచ్చేందుకు పాతగూడ గ్రామంలో మరో కొత్త చెరువును ప్రభుత్వం మంజూరు చేసింది. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం వాలగులపల్లి లో 200 ఎకరాలకు సాగు నీరిచ్చేందుకు, అదే మండలంలో ఘన్పూర్ లో 250 ఎకరాలకు, ఇచ్చోడ మండలంలో జున్ని గ్రామంలో 200 ఎకరాలకు, తలమడుగు మండలం ఉమ్రి గ్రామంలో 320 ఎకరాలకు, బైజరత్నూర్ మండలంలో ఘన్పూర్ గ్రామంలో 150 ఎకరాలకు, నార్నూర్ మండలంలో మంజరి గ్రామంలో 140 ఎకరాలకు సాగు నీరిచ్చేందుకు గ్రామానికో కొత్త చెరువును ప్రభుత్వం మంజూరు చేసింది. అదే రీతిలో ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరు మండలంలో దంతనపల్లి గ్రామంలో 400 ఎకరాలకు నీరిచ్చేందుకు, ఇంద్రవెళ్లి మండలం దేవపూర్ గ్రామ పరిధిలో 190 ఎకరాలకు, గౌరాపూర్ గ్రామ పరిధిలో 250 ఎకరాలకు నీరిచ్చేందుకు గ్రామానికో చెరువును ప్రభుత్వం మంజూరు చేసింది. ఆదిలాబాద్ జిల్లాలోనే నేరేడిగొండ మండలం నేరేడిగొండ గ్రామంలో 200ఎకరాలకు, నార్నూర్ మండలం మేరేగాం గ్రామంలో 121 ఎకరాలకు, అదే మండలంలోని మహాగాం గ్రామ పరిధిలో 346 ఎకరాలకు, కొమురం భీం జిల్లాలో సిర్పూర్ – యూ మండలంలో మామిడి పల్లి గ్రామ పరిధిలో 121 ఎకరాలకు సాగు నీరు ఇచ్చేందుకు గ్రామానికో కొత్త చెరువును ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక నిర్మల్ జిల్లాలో కడెం మండలం ఇస్లాంపూర్ గ్రామ పరిధిలో 250 ఎకరాలకు, వాంకిడి మండలం కేరీత్ గ్రామంలో 1001 ఎకరాలకు, ఇచ్చోడ మండలం కోకాసమాన్నూర్ గ్రామంలో 150 ఎకరాలకు సాగు నీరు ఇచ్చేందుకు గాను గ్రామానికో కొత్త చెరువును మంజూరు చేసింది.

ముఖ్యమంత్రి హమీ మేరకు…చెరువులు మంజూరు.

—————————————————————
సాగు నీటి శాఖ మంత్రి హరీశ్ రావు ఆదిలాాబాద్ జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడి గిరిజన గ్రామాల ప్రజలు తమ గ్రామ పరిధిలోని ఆయకట్టుకు నీరుఇవ్వాలని కోరారు. వారి వినతిని పరిశీలించిన మంత్రి అక్కడ చెరువుల ద్వారానే నీరు ఇవ్వడం సాధ్యమని గ్రహించి ఈ మేరకు సాగు నీటి శాఖ ఇంజనీర్లకు ప్రజల డిమాండ్ ను పరిష్కరించాలని ఆదేశించారు. అయితే మిషన్ కాకతీయ కింద పాత చెరువుల పునరుద్ధరణ తప్ప కొత్త చెరువులు నిర్మించడం సాధ్యం కాదని, ఇందుకు నిబంధనలు అనుమతించవని ఇంజనీర్లు మంత్రి హరీశ్ రావుకు తెలిపారు. దీంతో ప్రజల వినతిని, మిషన్ కాకతీయ నిబంధనల వల్ల ఇబ్బందిని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి మంత్రి తీసుకెళ్లారు. ఆదిలాబాద్ జిల్లా గిరిజన గ్రామాల ప్రజల విజ్ఞప్తికి ముఖ్యమంత్రి సైతం సానుకూలంగా స్పందించి ఆదిలాబాద్ జిల్లాలో కొత్త చెరువుల ఏర్పాటుకు నిబంధనలు సడలించారు. గత ఫిబ్రవరి నెల 27వ తేదీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటన సందర్భంగా సీఎం అక్కడి ప్రజలకు కొత్త చెరువులు మంజూరు చేస్తానని హమీ ఇచ్చారు. ఈ మేరకు ఇంతకు మునుపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 26 కొత్త చెరువుల నిర్మాణానికి స్టేజ్ 1 అనుమతిని మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జి ఓ నంబరు 930 , తేదీ 30.11.17 ద్వారా రూ. 92 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ జీవోలో ఆదిలాబాద్ నియోజక వర్గంలో 5, బోథ్ నియోజకవర్గంలో 10, ఖానాపూర్ నియోజకవర్గంలో 6, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 6 చెరువులు ఉన్నాయి. ఇక మండలాల వారీగా చూసినప్పుడు బేల , తాంసీ,బోథ్,ఖానాపూర్, వాంకిడి , ఆదిలాబాద్, నేరెడిగొండ,తలమడుగు , జైనూరు, ఆసిఫాబాద్ మండలాల్లో ఒకటి చొప్పున , ఇచ్చోడా , గుడిహత్నూర్, ఇంద్రవెల్లి , నార్నూర్ మండలాల్లో 3 , కడం ,కేరామేరి మండలాల్లో 2 చొప్పున కొత్త చెరువులను మంజూరు చేశారు. ప్రస్తుతం ఈ 26 చెరువులకు సంబంధించి భూసేకరణ తదితర చట్టపరమైన పనులు జరుగుతున్నాయి. ఈ 26 చెరువులతో పాటు ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, కొమురం భీం ఆసీఫా బాద్ జిల్లాల పరిధిలో 18 కొత్త చెరువుల నిర్మాణానికి ప్రభుత్వం జీవో విడుదల చేసింది.ఈ 18 కొత్త చెరువులకు స్టేజ్ -1 అనుమతుల్లో భాగంగా భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ పనులు వేగంగా చేపట్టాలని మంత్రి హరీశ్ రావు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సాగు నీటి శాఖ ఇంజనీర్లును ఆదేశించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat