బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అత్యంత విలాసవంతమైన ఇల్లనును ఖరీదు చేసినట్టు బీటౌన్‌లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దాదాపు56 కోట్ల రూపాయల వ్యయంతో ఆ ఇంటిని కొన్నట్టు బాలీవుడ్ వర్గాల సమాచారం.
ముంబై 360 వెస్ట్‌లోని టవర్ బీలో 42, 43 ఫ్లోర్‌లలో విస్తరించి ఉన్న డూప్టెక్స్ హౌస్‌ను షాహిద్ కొనుగోలు చేశాడు. ఈ బిల్డింగ్‌లో ఆరు పార్కింగ్ స్లాట్స్‌ను షాహిద్‌కు కేటాయించారు.
ఆధునిక సౌకర్యాలు కలిగిన ఆ ఫ్లాట్ కోసం 56 కోట్ల రూపాయలు ఖర్చు చేశాడని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఆ ఇంటిని కొనుగోలు చేసినందుకుగాను ప్రభుత్వానికి రూ.3 కోట్ల మేర స్టాంప్‌డ్యూటీ కట్టినట్టు తెలిసింది.