ఆరు వారాలకు పైగా ఇంటికి దూరంగా ఉన్న హౌస్ మేట్స్‌కు బిగ్‌బాస్ ఓ మంచి అవకాశాన్ని అందించారు. వారి ఇంటి సభ్యులతో ముచ్చటించేందుకు ఓ ఫోన్‌ను ఇంట్లో అమర్చాడు. అయితే ఈ ఫోన్‌ను మొదటగా గీత లిఫ్ట్ చేసి.. అవతల వారు ఇచ్చే హింట్స్‌తో ఆ వ్యక్తి ఎవరో గుర్తు పట్టి వారికి ఫోన్ ఇవ్వాలి. ఇలా ఫోన్ మాట్లాడిన వ్యక్తి తరువాతి కాల్‌ను లిఫ్ట్ చేసి.. వారిచ్చే హింట్స్‌ను గుర్తుపట్టి సరైన హౌజ్‌మేట్‌కు ఫోన్‌ను ఇచ్చేయాలి. ఇలా గుర్తుపట్టని యెడల ఆ ఫోన్ కట్ అయిపోతుంది. ఆ హౌస్ మేట్‌కు తన వాళ్లతో మాట్లాడే అవకాశం కోల్పోతారు.
మొదట వచ్చిన కాల్‌ను గీత లిఫ్ట్ చేయగా.. మిష్టర్ ఫర్‌ఫెక్ట్, మోడలింగ్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చారు అని చెప్పగా.. కౌశల్‌కు ఫోన్ ఇచ్చారు. కౌశల్ పిల్లలు మాట్లాడగానే కన్నీరు పెట్టుకున్నాడు. తన బిజినెస్, పిల్లల స్కూల్ వివరాల గురించి అడిగాడు. కౌశల్ భార్య మాట్లాడుతూ.. బిగ్‌బాస్ హౌస్‌లో ఫ్రెండ్స్‌గా భావించి మాట్లాడే వారే నీ గురించి నెగెటివ్‌గా ప్రచారం చేస్తున్నారు అలాంటి వారితో జాగ్రత్తగా ఉండమని, బయట తనకు ఫాలోయింగ్ ఉందని కౌశల్ చెప్పారు. నందిని, దీప్తిల విషయాన్ని కూడా ప్రస్తావించారు. తనకు సోషల్ మీడియాలో భారీగా సపోర్ట్ లభిస్తోందని, గేమ్ జాగ్రత్తగా ఆడాలంటూ సలహా ఇచ్చారు. కౌశల్ తన భార్య, పిల్లలతో మాట్లాడి ఎమోషనల్ అయ్యాడు. ఆమెతో మాట్లాడినంతసేపు కౌశల్ ఎమోషనల్ అయ్యాడు. తన కొడుకు ఐ లవ్ యూ పప్పా ఆల్ ది బెస్ట్ అని చెప్పగానే కన్నీళ్లు పెట్టుకున్నాడు కౌశల్.
Tags bigboss2 koushal Phone tollywood wife