తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేత, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పై ఉమ్మడి హైకోర్టులో న్యాయవాదిగా పని చేస్తున్న రామారావు అనే వ్యక్తి సీరియస్ ఆరోపణ చేశారు. ఇది రాజకీయ పరమైందో ,నిజమైందో తెలియదు కాని ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి షెల్ కంపెనీలు పెట్టి వందల కోట్ల మేర మనీలాండరింగ్ కు పాల్పడ్డారని అభియోగం మోపారు..
ఉమ్మడి హైకోర్టు లాయర్ గా ఉన్న రామారావు అనే ఆయన ఈ ఫిర్యాదు చేశారట.హైదరాబాద్ సిబిఐ ఆఫీస్ లో ఆయన ఈ ఫిర్యాదు చేశారు. రేవంత్ 18 షెల్ కంపెనీలుపెట్టి రూ.200 నుంచి రూ.300 కోట్లు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
తన బంధువుల పేర్ల మీద శ్రీసాయి మౌర్య ఎస్టేట్స్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు.ఈ క్రమంలో కోకాపేటలోని ఒక భూమికి సంబందించి కూడా ఆరోపణలు చేశారు.