Home / EDITORIAL / హైద‌రాబాద్ చ‌రిత్ర‌లో మ‌లుపు..!

హైద‌రాబాద్ చ‌రిత్ర‌లో మ‌లుపు..!

అనేక రాష్ర్టాల, భాషల, మతాల సంస్కృతులకు చెందిన ప్రజలు నివసించే భాగ్యనగరంలో రాజకీయాలు మిగతా రాష్ట్రంతో పోలిస్తే కొంత భిన్నంగా ఉంటాయి. అందునా మొదటి నుండీ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితికి పెద్దగా బలం లేదు. అటువంటి పరిస్థితిలో ఎన్నికల యుద్ధరంగంలోకి అడుగుపెట్టిన కేటీఆర్, అనితర సాధ్యమైన విజయాన్ని సాధించారు. జీహెచ్‌ఎంసీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సింగిల్ పార్టీకి 99 మంది కార్పొరేటర్లను గెలిపించుకు వ‌చ్చారు. దానికి ఆయన అవలంబించిన విభిన్న వ్యూహాలు, కనబరచిన రాజకీయ చతురత, చేసిన కఠోర శ్రమ, నభూతో నభవిష్యతి! విశ్లేష‌కుల మాటల్లో చెప్పాలంటే…గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ చరిత్రాత్మక విజయం ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్‌కు నగర పౌరులు వేసిన ఓటు మాత్రమే కాదు.. అది మంత్రి కేటీఆర్ అలోచనలకు, ఆచరణకు, నిబద్ధతకు హైదరాబాదీలు బలంగా వేసిన ఆమోదముద్ర. నిజానికి గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్ సంప్రదాయకంగా బలహీనంగా ఉన్న మాట వాస్తవం. అటువంటిచోట కొన్ని కార్పొరేటర్ సీట్లు గెలవడమే ఘనం.

కానీ ఏకంగా 99 సీట్లు సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం అనే అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన నాయకుడు కేటీఆర్.అయితే ఈ విజయం అలవోకగా సాధ్యం కాలేదు. దీని కొరకు కేటీఆర్ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగారు. ఒక వార్ రూం ఏర్పాటు చేసి, ఎన్నికల ప్రచారం మొత్తం అక్కడినుండే పర్యవేక్షించారు. మంత్రి కేటీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారంలో కొత్త పుంతలు తొక్కింది. నగరానికొక ప్రత్యేక మ్యానిఫెస్టో రూపొందించడం మొదలుకొని, అన్ని ప్రధాన భారతీయ భాషల్లో పార్టీ కరపత్రాలు తయారుచేయడం, సోషల్ మీడియాను విస్తృతంగా ప్రచారానికి వాడుకోవడం, వందలాదిగా ఉన్న టికెట్ ఆశావహులను బుజ్జగించి పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషిచేసేలా చేయడం.. ఇలా మంత్రి కేటీఆర్ అన్నీ తానై ఈ ఎన్నికల సంగ్రామాన్ని ముందుండి నడిపారు. ఇతర పార్టీల వెన్నులో వణుకు పుట్టించేలా సాగిన టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారం.

ఇంకా ఎన్నికలు జరుగక ముందే విపక్షాలు అస్త్రసన్యాసం చేసేలా చేసింది. త‌ద్వారా తండ్రి చాటు బిడ్డనే అని కొందరు అనుకున్నా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘనవిజయంతో నవతరం నాయకుడిగా కేటీఆర్ విశ్వరూపం సాక్షాత్కారం అయ్యింది. తెలంగాణ ప్రభుత్వం అంతకు ముందు ఏడాదిన్నరలో చేసిన అభివృద్ధి, భవిష్యత్తులో చేయబోయే అభివృద్ధి ప్రణాళికలను స్పష్టంగా నగరవాసులకు చేరేలా నగరపు మూలమూలల కలియదిరిగి చెప్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన భుజాలపై మోపిన గొప్ప బాధ్యతను విజయవంతంగా నిర్వర్తించారు. అన్ని ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలకు హైదరాబాద్ ఆత్మీయ ఆతిథ్యం ఇస్తుందని, అందరం కలిసిమెలిసి ఉందామని, నగరాన్ని, రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకుందామన్న రామన్న పిలుపును నగరవాసులు నిండుమనసుతో ఆహ్వానించారు. టీఆర్‌ఎస్‌కు చరిత్రాత్మక విజయాన్ని కట్టబెట్టారు. త‌ద్వారా గ్రేట‌ర్‌లో టీఆర్ఎస్ గెలుపు, హైద‌రాబాద్ చ‌రిత్ర‌ను మ‌లుపు తిప్పే అవ‌కాశాన్ని అందించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat