ఆంద్రప్రదేశ్ లోని 2014 ఎన్నికల్లో చంద్రబాబు అధికారం చేపట్టడానికి ఉత్తరాంధ్ర జిల్లాలు కూడా గట్టి మద్దతుగా నిలిచాయి. ఎక్కువగా సీట్లు కైవసం చేసుకున్న ప్రాతం ఇదే. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో మొత్తం 34 స్థానాలుండగా దాదాపుగా 25 స్థానాలను టీడీపీ కూటమి కైవసం చేసుకుంది. ఐదు ఎంపీ స్థానాల్లోనూ నాలుగింటిని సైకిల కూటమి కైవసం చేసుకుని ఆ తర్వాత వైసీపీ నుండి గెలిచినఅరకు ఎంపీకి కొత్తపల్లి గీతకి కూడా కండువా కప్పేసింది టీడీపీ. అయితే ఉత్తరాంధ్రలో తాజా పరిస్థితిపై ఇంటెలిజెన్స్ సర్వే చంద్రబాబుకు చెమటలు పట్టిస్తోంది. ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక కథనం ప్రకారం ఉత్తరాంధ్రలో టీడీపీ ప్రస్తుత పరిస్థితి సరిగ్గా 2004కు ముందు పరిస్థితి తరహాలోనే ఉందని తేలింది. ఉత్తరాంధ్రలో ఏ ఒక్క వర్గం కూడా పాలనపై సంతృప్తిగా లేదని ఇంటెలిజెన్స్ సర్వే చంద్రబాబుకు స్పష్టం చేసింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన 600 అపద్దపు హామిల్లో ఒకటి కాదు రెండుకాదు ఏ ఒక్కటి నెరవేర్చలేక పోయింది అధికారంలో ఉన్న టీడీపీ పార్టీ. మరి ముఖ్యంగా విశాఖకు రైల్వే జోన్ తీసుకురాలేక పోయారు.విశాఖ రైల్వే జోన్ కోసం ఏపీ ప్రజలు రోడ్డుపైకి వస్తే అక్రమంగా అరెస్ట్
లు చేశారు.దీంతో టీడీపీకి వచ్చే ఎన్నికల్లో గట్టి దెబ్బ తగులుతుందని సర్వే చెబుతుంది. ఈ మూడు జిల్లాలో ఒక ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలు ఫిరాయించిన వైసీపీ బలం ఏమాత్రం తగ్గలేదని చెబుతుంది. వైసీపీ మూలలనే లేకుండా చేయలనుకునే టీడీపీకి రివర్స్ దెబ్బ తగలడం ఖాయం అని ఇంటెలిజెన్స్ సర్వే కథనం. ఉత్తరాంధ్ర జిల్లాలో 2004 కు ముందు టీడీపీ ఏలా ఉందో 2019కి కూడ టీడీపీ పార్టీ అలా ఉండబోతుంది అని తెలుగు తమ్ముళ్లకు తెలియగానే ఆందోళనలో పడ్డారు.
Tags 2019 elactions Chandrababu intaligens survey