తెలంగాణ రాష్ట్ర యువ మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా కూకట్పల్లికి చెందిన టీఆర్ఎస్ నాయకులు విన్నూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. కేటీఆర్ హ్యూమన్ పిక్సెల్ పోట్రైట్ తోపాటు వీడియో రూపొందించారు. కూకట్పల్లి ఖైతలాపూర్ సమీపం లోని మైదానంలో 712 మంది కేటీఆర్ అభిమానులు ఆయన ముఖచి త్రం ఆకారంలో నిలబడి వీడియో రూపొందించారు.
22,500 అడుగుల స్థలంల వారంతా నిల్చున్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, సిరిసిల్ల చేనేత కార్మికులు, మైనార్టీలు, మహిళలు, ఐటీ ఉద్యోగులు, హైకోర్టు న్యా యవాదులు పాల్గొన్నారు. దేశంలోనే మొదటిసారిగా కేటీఆర్ ముఖ చిత్రంపై హ్యూమన్ పిక్సెల్ పోట్రైట్ రూపకల్పన చేశామని నిర్వాహకు లు పాటిమీది జగన్మోహన్రావు తెలిపారు.