Home / EDITORIAL / తార‌క‌రాముడు…గ‌నుల‌తో విజ‌యం సాధించిన ఘ‌నుడు..!

తార‌క‌రాముడు…గ‌నుల‌తో విజ‌యం సాధించిన ఘ‌నుడు..!

గ‌ని అంటే..భూగ‌ర్భ వ‌న‌రు. ప్ర‌భుత్వానికి ఆదాయాన్ని చేకూర్చే విలువైన వ‌న‌రు.అయితే స‌మైక్య పాల‌న‌లో అది చ‌మురు చందాన క‌రిగిపోయిందే త‌ప్ప‌…ఖ‌జానాకు పైసా మిగ‌ల్చ‌లేదు. నాయ‌కులు బ్యాంక్ బ్యాలెన్స్‌లు పెరిగాయే త‌ప్ప ప్ర‌భుత్వ ఖ‌జానా నిండ‌లేదు. అయితే స్వ‌రాష్ట్రంలో ప‌రిస్థితి మారింది. గ‌నుల శాఖ మంత్రిగా కేటీఆర్ బాధ్య‌త‌ల స్వీక‌ర‌ణ త‌ర్వాత శాఖ
రూపురేఖ‌లు మారిపోయాయి. మంత్రి కేటీఆర్ సార‌థ్యంలో గనుల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి.టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ నాలుగేండ్లలో గనుల ఆదాయం 80 శాతం పెరుగగా, కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో పెరిగిన ఆదాయం 50 శాతం మాత్రమే.పారదర్శక విధానాలను
అవలంబించడంతోపాటు, జవాబుదారీతనం పెరుగడంతో నిర్దేశించుకున్న లక్ష్యాలను అధిగమిస్తున్నది.

ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ చివరి నాటికే ప్రభుత్వం నిర్దేంచిన లక్ష్యాన్ని దాటింది. రాష్ట్ర ఐటీ, గనులు, పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావు తీసుకొచ్చిన సంస్కరణలు రాష్ట్రంలో గనుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచేందుకు ఎంతో దోహదం చేశాయి. అదేవిధంగా పర్యావరణహితమైన గనుల తవ్వకాలపై దృష్టి పెట్టడంతో కాలుష్యాన్ని అరికట్టగలిగారు. ఈ ఆర్థిక సంవత్సరం 2017 ఏప్రిల్ నుంచి 2018 మార్చి వరకు రూ.3,500 కోట్ల ఆదాయం లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. ఇందులో నవంబర్ నాటికి రూ. 2,213 కోట్లు లక్ష్యంగా నిర్ణయించుకోగా, ఆదాయం రూ.2,290 కోట్లకు చేరుకుని లక్ష్యాన్ని అధిగమించింది. రాష్ట్ర గనుల శాఖ మంత్రి కే తారకరామారావు తీసుకున్న అనేక నిర్ణయాలు గనులశాఖ ఆదాయం పెరుగడానికి దోహదం చేశాయి.

లీజుల అనుమతుల ప్రక్రియను ఆన్‌లైన్ చేయడంతోపాటు, ఇతర పరిపాలనాపరమైన అంశాల్లో సాంకేతికతను వినియోగించి సులువైన విధానాలను తీసుకొచ్చారు. గనులశాఖకు ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించడంతో ఆ శాఖకు చెందిన పూర్తి సమాచారం అందుబాటులోకి వచ్చింది. ఈ పోర్టల్ ద్వారానే గనులశాఖ చెల్లింపులు ఆన్‌లైన్ ద్వారా చేసే వెసులుబాటు కలిగింది. ఒకేచోట సంవత్సరాలుగా తిష్టవేసిన అధికారులు, సిబ్బందిని ఏకకాలంలో బదిలీచేసి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అసాధారణ పురోగతి సాధించిన శాఖల్లో గనులశాఖ ఒకటిగా నిలిచింది. ఈ శాఖ ద్వారా 2016-17లో రూ.3,169 కోట్ల ఆదాయం లభించింది. 103 శాతం లక్ష్యాన్ని సాధించి, దేశంలోనే అత్యధిక వృద్ధిరేటు నమోదైన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.

ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుని ఎలాంటి కార్యకలాపాలు చేపట్టని గనులపై చర్యలు తీసుకుంటున్నారు. లీజు నిబంధనలకు అనుగుణంగా మైనింగ్ ప్రారంభిస్తే ప్రభుత్వానికి ఆదాయంతోపాటు, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఈ కారణంగానే పనులు ప్రారంభించని గనులపై చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అలాగే ప్రమాణాలు పాటించకుండా
మైనింగ్ చేస్తున్న క్వారీలపైనా కఠినంగా వ్యవహరిస్తున్నారు.

గనులశాఖలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ముఖ్యంగా తనిఖీలను డిజిటలైజ్ చేసేందుకు ఐటీ సహకారాన్ని తీసుకుంటున్నారు. తనిఖీలను రియల్ టైం మానిటరింగ్ చేయడం, తనిఖీల నివేదికలను క్షేత్రస్థాయి నుంచే పంపే ఏర్పాట్లు చేశారు. ప్రతి గనిని జియోట్యాగ్ చేయడంతోపాటు, హద్దులు దాటి మైనింగ్ చేయకుండా జియోఫెన్సింగ్ ఏర్పాటుచేశారు. ఇలా సాంకేతిక అంశాలను గనులశాఖలో అమలు చేయడం ద్వారా పారదర్శకత పెరగడంతో పాటుగా ప్రభుత్వ ఆదాయం పెరుగుతూ వచ్చింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat