బీజేపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. అయితే, ఇటీవల కాలంలో వైఎస్ జగన్‌పై ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ప్రశంసల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు అటు టీడీపీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా కొనసాగడం దారుణమని, వారు వెంటనే రాజీనామా చేయాలని వైసీపీకి మద్దతుగా నిలిచారు. అలాగే, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు కూడాను.
జగన్ పాదయాత్రపై మాట్లాడుతూ.. జగన్ మోహన్‌రెడ్డిలా పాదయాత్ర చేయడం ఎవ్వరికి సాధ్యం కాదని, ఏదో రెండు మూడు రోజులు అంటే సరే.. కానీ నెలల తరబడి పాదయాత్ర చేయడం వేరంటూ జగన్‌ను అభినందించారు. తాను కూడా పాతయాత్ర చేయాలని అనుకున్నానని, కానీ అంత సులభం కాదని తెలిసి వెనకడుగు వేశానన్నారు. జగన్‌కు ఉన్న పట్టుదల, మొండితనంతోనే తన ప్రజా సంకల్ప యాత్రను కొనసాగిస్తున్నారన్నారు. త్వరలో ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్న జగన్‌ను కలిసి అభినందిస్తానని చెప్పారు విష్ణుకుమార్ రాజు. తన మామకు వైఎస్ జగన్ అంటే చాలా ఇష్టమని, వైఎస్ జగన్‌ను కలిపించాలని తన మామ ఎప్పుడూ కూడా నన్ను అడుగుతుంటాడని మీడియా ముఖంగా చెప్పాడు విష్ణుకుమార్ రాజు. జగన్ తన పాదయాత్రలో భాగంగా వైజాగ్ వస్తే వెంటనే తన మామను తీసుకెళ్లి కల్పిస్తానని చెప్పారు.
అంతేగాక, ఇటీవల కాలంలో జగన్‌తో కలిసేందుకు మోడీ సర్కార్ సుముఖత చూపుతున్నట్లు మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్న విషయం తెలిసిందే. దాంతోపాటు పలు మీడియాలు చేసిన సర్వేల్లోనూ జగన్‌కు ప్రజల్లో ఆదరణ పెరిగిందని, నెక్ట్స్ సీఎం జగన్ అన్న సంకేతాలను ఇచ్చాయి కూడా. ఈ నేపథ్యంలో వైసీపీలో మళ్లీ చేరేందుకు కొణతాల రామకృష్ణ రంగం సిద్ధం చేసుకున్న క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు కూడా అదే బాటలో నడిచేసేందుకు సిద్ధమయ్యారని సమాచారం.