ఏపీలో ఈ మద్య అవినీతి తిమింగలాలు కుప్పలు కప్పలుగా బయటపడుతున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలో ఏసీబీ వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. ఆదాయానికి మించిన ఆస్తులన్నాయన్న ఆరోపణలతో జిల్లాలోని గుంతకల్లు రవాణాశాఖ కానిస్టేబుల్ రవీంద్రనాథ్ ఇంట్లో అధికారులు దాడులు నిర్వహించారు. కానిస్టేబుల్ ఇల్లు, ఆర్టీఏ ఆఫీస్‌తో పాటూ మొత్తం ఐదుచోట్ల నిర్వహించిన ఈ సోదాల్లో భారీగా అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించారు. తనిఖీల్లో 2.09లక్షల డబ్బు, కేజీ బంగారం, 1.5 కేజీల వెండి, రెండు కార్లు, రెండు బైక్‌లుతో పాటూ పలు కీలక డాక్యుమెంట్లను సీజ్ చేశారు. అక్రమాస్తుల్లో ఎక్కువ స్థలాలు, వ్యవసాయ భూములు ఉన్నట్లు తేలింది.
ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో ఈ సోదాలు నిర్వహించామంటున్నారు ఏసీబీ అధికారులు. తనిఖీల్లో అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించామని.. రవీంద్రనాథ్‌రెడ్డికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు, లాకర్లను పరిశీలించాల్సి ఉందన్నారు. బంగారం, వెండితో పాటూ ఆయన పేరు మీద ఉన్న స్థిరాస్తుల విలువ మొత్తం కలిపి రూ.10కోట్లకుపైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రవీంద్రనాథ్‌రెడ్డి ప్రస్తుతం గుంతకల్లు రవాణాశాఖ ఆఫీస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు.