తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్,ఏపీ ముఖ్యమంత్రి,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కంటే అత్యంత పరిణితితో వ్యవహారిస్తున్నారు.రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిత్యం తెలంగాణాభివృద్ధికి అడ్డుపడుతున్న కానీ సీఎం కేసీఆర్ చాలా హుందాగా..పరిణితితో ఆలోచిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అడుగులుపెట్టిస్తున్నారు.
ఇక ఏపీలో ఏమి జరుగుతుందో అని సాక్షత్తు దేశ ప్రదాని మోడీ పార్లమెంటులో వ్యాఖ్యానించిన రెండు రోజులకే పబ్లిక్ ఎఫైర్స్ సెంటర్ అనే సంస్థ దానిని దృవీకరిస్తూ ర్యాంకు ఇవ్వడం విశేషం. సుపరిపాలనలో తెలంగాణ దేశంలో బాగుందని తేల్చింది. ఆంద్ర ప్రదేశ్ మాత్రం తొమ్మిదో ర్యాంకులో ఉంది.
కేరళ, తమిళనాడులు మొదటి రెండు స్థానాలలో ఉన్నాయి. కర్నాటక, గుజరాత్ లు నాలుగు ,ఐదు స్థానాలలో ఉండడం విశేషం. ఈ సంస్థ బెంగుళూరు నుంచి పనిచేస్తుంది. ఆయా రాష్ట్రాలలో శాంతిభద్రతల నిర్వహణ, పారదర్శకత, జవాబుదారీతనం, న్యాయకల్పన వంటి 30 అంశాల ఆధారంగా రాష్ర్టాలకు ర్యాంకుల్ని కేటాయిస్తూ.. ప్రజావ్యవహారాల సూచీ-2018ని పీఏసీ ఈ జాబితాను విడుదల చేసింది..