తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి గత నాలుగేళ్ళుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తున్నారు ..ఆసరా పెన్షన్ల దగ్గర నుండి కళ్యాణ లక్ష్మీ వరకు ..మిషన్ కాకతీయ దగ్గర నుండి మిషన్ భగీరథ వరకు పలు పథకాలను అమలు చేస్తూ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతున్నారు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ..
తాజాగా రానున్న ఎన్నికల నేపథ్యంలో గత నాలుగేళ్ళుగా ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ ఇతర పార్టీలకు చెందిన నేతలు చేస్తున్న విషప్రచారాన్ని తిప్పికొడుతూ ..గత నాలుగేళ్ళుగా తను నియోజకవర్గంలో చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి ప్రజలలో చైతన్యం తీసుకురావడమే కాకుండా అర్హులకు అందేవిధంగా చేయడానికి ఉత్సాహవంతులై .స్వతంత్రంగా దాదాపు పద్నాలుగు వందల మంది సోషల్ మీడియా నెటిజన్లు పార్టీ కోసం ..ఎమ్మెల్యే కోసం పని చేయడానికి ముందుకొచ్చారు.
ఈ క్రమంలో నిత్యం ఎమ్మెల్యే వెంట ఉంటూ ప్రజలకు ఎమ్మెల్యేకు వారధిగా పనిచేసే జక్కా రఘునంద రెడ్డి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నెటిజన్లను తీసుకురావడంలో తన వంతు పాత్ర పోషించారు . అయితే గత తొమ్మిది ఏళ్ళుగా సోషల్ మీడియా ,ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఎలక్షన్ , తదితర విభాగాల్లో ప్రచారం చేయడంలో అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న కరణ్ కాన్సెప్ట్స్ కంపెనీ అధ్వర్యంలో ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి నాయకత్వంలో జక్కా రఘునంద రెడ్డి నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది …