జనసేన అధినేత, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 2014 ఎన్నికలకు ముందు తాము పోటీ చేయాలన్న ఆలోచనతో చంద్రబాబును కలిస్తే .. మీరు పోటీ చేస్తే ఓట్లు చీలుతాయని నమ్మబలికి, మీ పార్టీ నేతల్ని రాజ్యసభకు పంపుతామని మాట ఇచ్చి, ఎన్నికల్లో గెలిచిన తరువాత సీఎం చంద్రబాబు మాట తప్పారని పవన్ కళ్యాణ్ అన్నారు.
కాగా, ఆదివారం విజయవాడలో రాజధాని ప్రాంత రైతులతో పవన్ కళ్యాణ్ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. టీడీపీ నమ్మకద్రోహం చేసింది కాబట్టే తాను నిలదీస్తున్నట్టు స్పష్టం చేశారు. రాజ్యసభ సీటు ఇస్తానని చెప్పిన చంద్రబాబు.. ఆ తరువాత ఏం చేశారన్నది ప్రతీ ఒక్కరికి తెలుసన్నారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే కొన్ని ఎమ్మెల్యే సీట్లయినా వచ్చి ఉండేవి అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం గమనార్హం.